వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని ప్రమాద బాధితులకు ఆటా అండ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికాలోని న్యూజెర్సీలో గల ఎవెనెల్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం పట్ల అమెరికా తెలుగు సంఘం (ఆటా) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదంలో ఓ ఆపార్టుమెంట్ భవనం పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాద బాధితులకు ఆటా అండగా నిలిచింది.

సమాచారం అందిన వెంటనే ఆటా ట్రస్టీలు బల్వంత్ రెడ్డి, శ్రీనివాస జిల్లా, తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలంగాణ కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ భవనం దగ్ధం వల్ల నష్టపోయిన 52 కుటుంబాల్లో 90 శాతం తెలుగువారికి సంబంధించినవే.

అగ్నిప్రమాద నష్టం విపరీతంగా ఉందని ఆటా తెలిపింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. దానిపై ఇంకా దర్యాప్తు సాగుతోంది. అదృష్టవశాత్తు అపార్టుమెంటులో నివసిస్తున్నవారిని సురక్షితంగా బయటకు తేగలిగారు. అయితే, ఫర్నీచర్, బంగారు, వస్త్రాలు, పాస్‌పోర్టులు, వీసాలు, వాహన రిజిష్టేషన్ వంటి పత్రాలన్నీ ప్రమాదంలో కాలిపోయాయి.

బాధిత తెలుగు కుటుంబాలకు సహాయం అందిస్తూ వారి పునరావాసానికి బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ జిల్లా నేతృత్వంలో ఆటా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. బాధితులకు ఆటా నుంచి తగిన సహాయం అందిస్తామని బల్వంత్ రెడ్డి చెప్పారు.

English summary
American Telugu Association (ATA) expressed grief over the massive fire accident in American Telugu Association (ATA) expressed grief over the massive fire accident in Avenel, New Jersey in which an Apartment building was completely burnt to ashes on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X