లండన్‌లో ఎన్నారైల క్రిస్ట్మస్ వేడుకలు

ఆ తర్వాత తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు, చర్చి నిర్వహకులు కలిసి క్రిస్ట్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై ప్రతినిధులు మాట్లాడారు. తెలంగాణ గడ్డ మత సామరస్యాన్నికి చిహ్నంగా నిలిచే ప్రదేశమని వారన్నారు.
తెలంగాణ ప్రజలు దేశానికే ఆదర్శమని, ఎప్పిటకీ ఇలాగే కలిసి మెలిసి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిచుకుని, దాన్ని పునర్నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కూర్మాచలం, రంగు వెంకట్, రాజు కొయ్యాడ, వినోద్ మధాడా, అశోక్ దూసరి, హరి నవాపేట్, ఉదయ్ నాగరాజు, రవి, మధు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం ఇటీవల లండన్‌లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా క్రిస్ట్మస్ వేడుకలను కూడా నిర్వహించింది.












Click it and Unblock the Notifications