వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా: ఇద్దరు పూజారుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA Map
న్యూఢిల్లీ: అమెరికాలోని విస్కాన్సిన్ గురుద్వారా వద్ద జరిగిన కాల్పుల ఘటనలో న్యూఢిల్లీకి చెందిన ఇద్దరు పూజారులు మరణించారు. మృతులు రంజిత్ సింగ్, సీతా సింగ్ అన్నదమ్ములు. సోమవారం వారి విష్ణు గార్డెన్ ఇంటి వద్ద విషాద వాతావరణం చోటు చేసుకుంది. బంధువులు, మిత్రులు, కమ్యూనిటీ లీడర్లు అక్కడికి చేరుకున్నారు. రంజిత్ 16 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అతని కుమారుడికి అప్పుడు ఏడు నెలల వయస్సు. ఇప్పుడు అతని కుమారుడు గుర్విందర్ సింగ్‌కు 17 ఏళ్లు.

రంజిత్ సింగ్ తన కుమారుడిని చూడడానికి దీపావళికి ఇక్కడికి రావాలని అనుకున్నాడు. తాను కాల్పుల సంఘటనను టీవీలో చూశానని, అయితే అందులో తన తండ్రి ఉంటాడని అనుకోలేదని, ఆదివారాలు మాత్రమే తన తండ్రి గురుద్వారాకు వెళ్తారని, తనకు ఉదయమే తన తండ్రి మరణవార్త తెలిసిందని గుర్వీందర్ చెప్పినట్లు జాతీయ మీడియా రాసింది. అతను తండ్రిని ఫొటోల్లోనే చూశాడు.

రంజిత్ సింగ్ తమ్ముడు సీతా సింగ్ ఫిబ్రవరిలో అమెరికా వెళ్లాడు. సీతా సింగ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆదివారంనాడు భార్య సురీందర్ కౌర్ సీతా సింగ్‌తో మాట్లాడింది. అమెరికాలో తన పని పట్ల సంతృప్తిగా ఉందని చెప్పాడని ఆమె చెప్పింది.

భారత ప్రభుత్వం గానీ అమెరికా ప్రభుత్వం గానీ తమతో మాట్లాడలేదని, మరణాలను నిర్ధారించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అమెరికాలోని తమ బంధువులు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు.

English summary
Among those killed in the shootout at a gurdwara in Wisconsin were granthis Ranjit Singh and Sita Singh, both brothers and originally from Delhi. On Monday, a pall of gloom descended on their Vishnu Garden home as mourning relatives, friends and community leaders visited the family to share their grief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X