తెరాస ఎన్నారైలతో కెసిఆర్

KCR connected to TRS NRI cell members
ఎన్నారై తెరాస విభాగం మొదటి వార్షికోత్సవం ఈ నెల 21వ తేదీన లండన్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస విభాగం సభ్యులు, ప్రవాస తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నారై తెరాస విభాగం సభ్యులు తెలంగాణ ఉద్యమానికి, పార్టీకి చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి కలిసికట్టుగా తెలంగాణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెరాస ఎన్నారై విభాగం సభ్యులను ఉద్దేశించి తెరాస నాయకులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కెటి రామరావు, పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రవణ్, బాల్క సుమన్, బొంతు రామ్మోహన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడారు. తాము గత ఏడాది కాలంగా నిర్వహించిన కార్యక్రమాలపై, భవిష్యత్తులో నిర్వహిచే కార్యక్రమాలపై ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడున అనిల్ కూర్మాచలం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది కేవలం తెరాస మాత్రమేనని ప్రజలు గుర్తించాలని, సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీలు ఎన్ని యాత్రలు చేసినా, దీక్షలు చేసినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని, ఆ పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఎన్నారై తెరాస విభాగం సభ్యులు నాగేందర్ చిందయ్, సృజన్ రెడ్డి చాడ కూడా మాట్లాడారు. ఎన్నారై తెరాస కోర్ కమిటీ సభ్యులు రాజు శినబోయిన, శ్రీకాంత్ రాజు పెద్దిరాజు, విక్రమ్ రెడ్డి రేకుల, ప్రవీణ్ కుమార్ వీరా, శ్రీధర్ రావు తక్కలపెళ్లి, సంజయ్ సేరు, రాజేష్ పొన్నుజ, సంతోష్ రెడ్డి, వినోద్ చెన్న. శశిధర్ చేబర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+