లండన్‌లో తెలంగాణపై చర్చ

డాక్టర్ శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను కొనియాడారు. అన్ని తెలంగాణ సంస్థలు, సమన్వయం, సహకారాలతో, ఐక్యతతో తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేయాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు ఎన్నారైలు వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. పరకాల ఉప ఎన్నికలో తెలంగాణవాదులకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కూడా మాట్లాడారు. ఉద్యమంలో పాల్గొన్నవారికే కష్టాలు, బాధలు, విమర్శలు అని ఆయన అన్నారు. వాటిని ఓర్పు, సహనంతో తట్టుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం కార్యక్రమాలను, భవిష్యత్తు కార్యాచరణను శ్రీధర్ పవర్ ప్లే ప్రజెంటేషన్ ద్వారా వివరించిట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధి గంప వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు పి. వెంకట్, వేణదు అంకం, తుకారాం, మధు, వెంకమల్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications