మెట్రో కింద పడి ఎన్నారై ఆత్మహత్య

భారతీయ కార్మికుడు సోమవారం మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, అతన్ని హెచ్‌యుఎంగా గుర్తించామని దుబాయ్ పోలీసు డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ ఖమీస్ మత్తర్ ఆల్ మజీనా చెప్పారు. ట్రాక్‌పై పడుకున్న అతనిపై నుంచి వేగంగా వెళ్తున్న మెట్రో రైలు దూసుకుపోయిందని చెప్పారు.
హెచ్‌యుఎం దుబాయ్‌లో 2010 నుంచి పనిచేస్తున్నాడని, తన రెసిడెన్సీ వీసాను రద్దు చేసి తనను ఇంటికి పంపిచాలని అతను యజమానిని అడిగాడని, సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడని మజీనా చెప్పారు. దుబాయ్ మెట్రో రైళ్లు ప్రారంభమై మూడేళ్లు అవుతుంది. మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మూడేళ్లలో ఇదే మొదటిది.
తన వీసాను రద్దు చేయాలని తన సంస్థను ఆేదశించాలని హెచ్‌యుఎం కార్మిక మంత్రిత్వ శాఖను కోరాడని, వీసాను సంస్థ రద్దు చేసిందని, అయితే, అతన్ని స్వదేశానికి పంపడంలో కంపెనీ ఎందుకు జాప్యం చేసిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని మజీనా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications