లండన్‌లో ఎన్నారైల రక్తదానం

జయశంకర్ స్ఫూర్తితో చారిటీ, సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాకుడా యుకెలోని తెలంగాణ పౌరులకు మద్దతుగా పునాది స్థాయిలో పనిచేస్తామని ఆయన చెప్పారు. అత్యంత సమర్ధుడైన కెసిఆర్ నాయకత్వంలోని తెరాసను బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని, అది మాత్రమే జయశంకర్‌కు నిజమైన నివాళి అని ఆయన అన్నారు.
తాము చేపట్టిన కార్యక్రమాన్ని యుకె - యుహెచ్ఎస్ అభినందించినట్లు ఎన్నారై తెరాస విభాగం మీడియా విభాగం తెలిపింది. యుకె - స్థానిక చారిటీ కార్యక్రమాలకు ఇతరులను నుంచి మద్దతుకు ఈ కార్యక్రమం స్ఫూర్తినిస్తుందని ప్రశంసించింది. బాధ్యతాయుతమైన యుకె రెసిడెంట్స్‌గా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
ఎన్నారై తెరాస విభాగం కోర్ సభ్యులు రాజకుమార్ శానబోయిన, రాజేష్ పొన్నోజు, అశోక్ దూసరి, వెంకట్ రెడ్డి దొంతుల, హరి, అబజార్ మొహ్మద్, తెలంగాణ ఎన్నారైలు పస్పూరి రవికాంత్ రెడ్డి, ఉదయ్ నాగరాజు, నర్సారెడ్డి తూటికూర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications