చంద్రబాబుకు ఎన్నారైల సంఘీభావం

జీరో సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో చలి వణికిస్తున్నప్పటికీ మద్దతుదారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా మొదటి టిడిపి మద్దతుదారులు పార్టీ జెండాలను చేతబూని పార్కు చుట్టూ పాదయాత్ర చేశారు. తెలుగుదేశం పార్టీ బ్యానర్లను, బ్యాడ్జీలను, కండువాలను, ఎన్టీఆర్ - చంద్రబాబు ఫ్లెక్సీలను ధరించారు.
దాదాపు వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు. జై తెలుగుదేశం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, ఆయన పాదయాత్ర వంటి నినాదాలు మారుమోగాయి. చంద్రబాబు నాయుడికి, ఆయన పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఆ తర్వాత ప్రసంగాలు సాగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కోడెల శివప్రసాద రావు, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్ వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసంగించారు. ఎన్నారైల మద్దతుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నారై టిడిపి కనెక్టికట్‌కు చెందిన శ్రీనివాస్ యెండూరి, తరణి పరచూరి, గోపాలకృష్ణ (గోపి), యోగేష్ అబ్బూరి, శ్రీనివాస్ అట్లూరి, రామకృష్ణ ఇంటూరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్నారై టిడిపి కనెక్టివిటీ ఇటీవల శాన్వీ సంఘటనపై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. అలాగే, టిడిపి నేత ఎర్రంనాయుడు మృతికి సంతాపసభ నిర్వహించింది.












Click it and Unblock the Notifications