వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ఎన్నారైల ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

Peaceful gathering for Special ballot Postal
ఓటు ముఖ్యమనే నినాదంతో ప్రవాస్ భారత్ సభ్యులున ఆగస్టు 31వ తేదీన లండన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శనకు దిగారు. తమ ఓటు సాధన కోసం ఈ ప్రదర్శనలో యునైటెడ్ కింగ్‌డమ్‌వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఓటు చేసే హక్కును సులభతరంగా వినియోగించుకునే అవకాశం కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. జై హింద్, మాకు ప్రత్యేకమైన బ్యాలెట్ కావాలి అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను వారు ప్రదర్శించారు.

ఎన్నారై ఓట్లు ప్రాముఖ్యం గురించి ప్రవాసి భారత్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నాగేందర్ చిందం వివరించారు. విదేశాల్లో 8 మిలియన్ల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, భారతదేశ ఎన్నికల్లో ఈ ఓట్లు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆయన అన్నారు. పది, 20 వేల ఓట్ల తేడాతో గెలిచే చాలా నియోజకవర్గాల్లో పది వేల నుంచి 15 వేల ఎన్నారై ఓట్లు ప్రత్యక్షంగా పార్లమెంటు సభ్యులను ఎంపిక చేసుకునే ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

విదేశాల్లోని తమ తమ పౌరులకు కెనడా, జర్మనీ, యుకె, అమెరికా, ఇండోనేషియా, పిలిప్పైన్స్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలు ప్రత్యేక బ్యాలెట్ పద్ధతిని అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఎన్నారైల కోసం పోస్టల్, ఆన్‌లైన్ వోటింగు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళనకారులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, భారత ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ప్రజాతంత్ర వోటింగ్ హక్కు కోసం ప్రచారం సాగించాలని ప్రవాసి భారత్ ప్రెస్ అండ్ ఇన్ఫో ఆర్తి మాధవి ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని, ఇండియన్ కాన్సులేట్లకు లేఖలు రాయాలని కోర్ సభ్యుడు అశోక్ దుసారి గల్ఫ్ దేశాల ఎన్నారైలను కోరారు. వెబ్‌సైట్‌లో అవసరమైన రిక్వెస్ట్ లెటర్స్ ఉన్నాయని కోర్ మెంబర్ రాజ్ శానబోయిన చెప్పారు. కోర్ మెంబర్ డాక్టర్ నరేష్ హంచాటే భారత ప్రభుత్వానికి ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా ఆన్‌లైన్ వోటింగ్ హక్కుపై సమాచారాన్ని పంపించారు.

ప్రవాసి భారత్ జట్టు సభ్యులు నాగేందర్ చిందం, ఆర్తి గుజారే, ఆశోక్ దుసారి, ప్రసన్న వెంకట మోహ్, రాజ్ శానబోయిన లండన్‌లోని భారత హై కమిషన్ ఎపిడబ్ల్యుఓ ఎకె షెరావత్‌ను కలిసి విజ్ఞప్తి పత్రం సమర్పించారు. ప్రధానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన విజ్ఞప్తి పత్రాలను అందజేశారు.

English summary
Today 31st August 2012, team Pravasi Bharat has organized a peaceful demonstration and gathering called “Vote is Important!” near Indian High Commission Office, London. In spite it is working day many Indian Citizens residing all over the United Kingdom has come forward to participate and peacefully demonstrate for their basic right of feasible abroad voting system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X