తెలంగాణ మార్చ్‌కు ఎన్నారైల మద్దతు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ న్యాయమైందని, సొంత రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావిస్తున్నామని పిటిఎ ప్రతినిధి రవి మేరెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. సమైక్యాంధ్రలో తమకు అన్యాయం జరిగిందని, తమ వాటా తమకు దక్కడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగితే తెలంగాణ ప్రాంత తీవ్ర నష్టానికి గురవుతుందని ఆయన అన్నారు.
తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, భవిష్యత్తు తరాలు నష్టపోకూడదనే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌లో పెద్ద యెత్తున పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, మనుగడ కోసం ప్రజలు పోరాటం చేయక తప్పని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలియజేస్తూ అమెరికాలోని, లండన్‌లోని ఎన్నారైలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications