వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజత్ గుప్తాకు రెండేళ్లు జైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajat Gupta
న్యూయార్క్: గోల్డ్‌మాన్ సాచ్స్ మాజీ డైరెక్టర్ రజత్ గుప్తాకు అమెరికా న్యాయమూర్తి రెండేళ్లు జైలు శిక్ష విధించారు ఐదు మిలియన్ అమెరికా డాలర్ల జరిమానా కూడా వేశారు. హెడ్జ్ ఫండ్ మేనేజర్‌కు బోర్డురూం రహస్యాలను వెల్లడించాడనే ఆరోపణలు ఇండియన్ అమెరికా వాల్ స్ట్రీట్ టైటాన్ దోషిగా తేలారు. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసు.

63 ఏళ్ల గుప్తాకు రెండేళ్ల జైలు శిక్ష, 5 మిలియన్ల అమెరికా డాలర్ల జరిమానాను విధిస్తున్నట్లు అణెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి జెడ్ రాకోఫ్ చెప్పారు. గత 18 నెలలు తనకు ఎంతో సవాల్‌తో కూడిన సమయమని రజత్ గుప్తా అన్నారు. తన మిత్రులపై, తన కుటుంబంపై, తనకు ఇష్టమైన సంస్థలపై ఈ సంఘటన వేసిన ప్రభావానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, జీవిత కాలం పాటు నిర్మించుకుంటూ వచ్చిన ప్రతిష్ట దెబ్బ తిన్నదని, ఈ తీర్పు ఎంతో బాధాకరమైందని ఆయన అన్నారు.

మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఆరు సందర్భాల్లో నాలుగు సందర్భాల్లో రజత్ గుప్తాను దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే హెడ్జే ఫండ్ వ్యవస్థాపకుడు రాజ్ రాజరత్నం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మాజీ మెక్‌కెన్సీ అధిపతిపై భరారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత రజత్ గుప్తాకు జైలు శిక్ష పడింది.

తనపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన తర్వాత రజత్ గుప్తా ఎఫ్‌బిఐ ముందు లొంగిపోయారు. గుప్తా గోల్డ్‌మాన్ సాచ్స్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ బోర్డు సీట్లను సాధించే స్థాయికి ఎదిగారు. హైదరాబాదులోని బిజినెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడు కూడా. బిల్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ సలహాదారుగా కూడా పనిచేసారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ ఎఎంఆర్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

English summary
Former Goldman Sachs director Rajat Gupta has been sentenced to two years in prison and fined USD 5 million by a US judge, months after the Indian-American Wall Street titan was found guilty of leaking boardroom secrets to a hedge fund manager in the largest insider trading case in the country's history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X