లండన్‌లో తెలంగాణ స్ఫూర్తి సభ

ప్రొఫెసర్ జయశంకర్‌కు తొలుత కొవ్వొత్తులు ధరించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ జెఎసి నాయకుడు డాక్టర్ ఎ శ్రీధర్ మాట్లాడారు. జయశంకర్‌తో తనకు గల అనుబంధాన్ని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కృషిని, త్యాగాన్ని సభకు వివరించారు.
తెలంగాణవాదులంతా జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలని ఆయన సూచించారు. ఖండాంతరాళ్లో తెలంగాణ సంస్కృతి, అస్తత్వాన్ని కాపాడుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై విభాగాన్ని, తెలంగాణ ఎన్నారై ఫోరాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడారు. జయశంకర్ భౌతికంగా మన మధ్య లేకపోవడం తెలంగాణకు తీరని లోటు అని ఆయన అన్నారు. తన జీవితాన్ని జయశంకర్ తెలంగాణకు అంకితం చేశారని ఆయన అన్నారు. జయశంకర్ లేకపోవడం ప్రత్యేకంగా తెరాసకు తీరని లోటు అని ఆయన అన్నారు.
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే జయశంకర్‌కు తాము అర్పించే నివాళి అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంపా వేణుగోపాల్ మాట్లాడుతూ - జయశంకర్ తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా స్వర్గస్థులు కావడం చాలా బాధాకరమని అన్నారు. జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణకు ఉత్తమ సేవలందించినవారికి వచ్చే ఏడాది నుంచి జయశంకర్ వర్ధంతి సందర్భంగా పురస్కారాలు అందజేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస విభాగం కమిటీ సభ్యులు రాజ్‌కుమార్ సానబోయిన, శ్రీకాంత్, విక్రమ్, మహేష్, రాజేషశ్, అబుజర్, తెనా ప్రతినిధులు వెంకట్ పబ్బతి, అర్జున్, రంగు వెంకట్, మేకల గోపాల్, రాజు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications