వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదం తొక్కిన తెలంగాణ ఎన్నారైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana NRIs march in USA in support of September 30th Telangana March
సెప్టెంబర్ 30 తెలంగాణ ప్రజల కవాతుకు ‘మేము సైతం' మద్దతు తెలపాలని, సంఘీభావం ప్రకటించాలని తెలంగాణ ఎన్నారై లు సమాయత్తమయ్యారు. తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఉత్తర అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ‘సంఘీభావ యాత్రలు' నిర్వహించాలని పిలుపునిచ్చింది. బోస్టన్ , న్యూ జెర్సీ, ఫిలదెల్ఫియా, డెట్రాయిట్ నగరాల్లో సెప్టెంబర్ 22 నాడు మధ్యాహ్నం ‘తెలంగాణ మార్చ్ సంఘేభావ యాత్రలు' నిర్వహించాలని తెనా కార్యక్రమం రూపొందించింది. తెనా పిలుపుకు స్పందించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారై లు వారి వారి ప్రాంతాల్లో ‘సంఘీభావ యాత్రలను' అత్యంత విజవంతంగా నిర్వహించి తెలంగాణ మార్చ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు.

తెనా , ఎన్ జె టి ఏ (న్యూ జెర్సీ తెలంగాణ అసోసియేషన్) సంయుక్తంగా , న్యూ జెర్సీ రాష్ట్రం, న్యూ బ్రన్స్విక్ నగరంలో బ్యూక్లె పార్క్ లో ‘సంఘీభావ యాత్ర'ను నిర్వహించాయి. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం మూదు గంటల కల్లా బ్యూక్లె పార్క్ కు తెలంగాణా ఎన్నారై లు , తెలంగాణ రాష్ట్ర పటం ముద్రించిన జండాలతో, తెలంగాణ మార్చ్ కు మద్దతు తెలుపుతూ రాసిన నినాదాల ప్లకార్డ్ లతో, ‘వి సప్పోర్ట్ తెలంగాణ మార్చ్ ‘ అని పెద్దగా రాసిన అక్షరాల బానర్ తో చేరుకున్నారు. ఒక అరగంట కాలంలో దాదాపు యాభై కన్నా ఎక్కువగా ఎన్నారై లు పార్కు లో గుమిగూడారు. మెల్ల మెలగా వాన చినుకుల్లా మొదలై , అతి తక్కువ కాలంలో ఒక జడివాన గా మారారు. ఒక కెరటంలా ఎగసి పడ్డారు! అందరి ముఖాల్లో ఒక ఆవేశం, ఒక ఉద్విగ్నత, ఉరకలెత్తే ఉత్సాహం.

శ్రీనివాస్ కొంపల్లి, విద్య వెంకటయోగి ముందు బానర్ పట్టుకుని దారి తీయగా వెనక నారాయణస్వామి వెంకటయోగి, రవి ధన్నపునేని, శ్రవన్ నాగపురి, నరసింహ మేకల, ప్రదీప్ సువర్ణ, మహేష్ పొగాకు, శిరీష పొగాకు, వెంకటేశం నల్లా, రమేష్ మాగంటి, రత్నాకర్ ఆర్కె, రజని కాంత్ , కిషోర్ బుపతి, వెంకట్రాజం చిలుక, శ్రీనివాస్ కోడూరి, ప్రొ. లక్ష్మిరాజం కోడూరి, ప్రొ. నాగేశ్వర్ రావు, శ్రీనివాస్ గనగోని, రవి పుస్కుర్ , జమున పుస్కుర్ , బలరామ్ , ప్రశాంత్ తవుటం, తుషిర వెంకటయోగి, ప్రీతి నాగపురి, శరణ్య పొగాకు తదితర ఎన్నారై లంతా ప్లకార్డులు , జండాలు పట్టుకుని నినాదాలు హోరెత్తుతూ ఊరేగింపు ప్రారంభించారు.

‘ఏక్ ఔర్ ధక్కా తెలంగాణ పక్కా' , ‘వి సపోర్ట్ తెలంగాణ మార్చ్ ‘, ‘ వి వాంట్ తెలంగాణ స్టేట్ నౌ' , ‘ ప్రభుత్వం తెలంగాణ మార్చ్ కు అనుమతినివ్వాలి', ‘తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరులకు జోహార్లు', ‘ తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి కి జోహార్లు' అంటూ నినాదాలు మిన్నంటగా తెలంగాణ ఎన్నారై లు ‘సంఘీభావ యాత్ర' ను అత్యుత్సాహంగా నిర్వహించారు. దాదాపు అరగంట ఊరేగింపు తర్వాత ఎన్నారైలంతా ఒక చోట సమావేశమై నినాదాలని కొనసాగించారు. పార్కులో వాతావరణమంతా ఎంతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఎటు చూసినా ‘జై తెలంగాణ' అలలలుగా ఎగసిపడ్దది.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష హోరెత్తింది. తర్వాత తెనా , ఎన్ జే టీ ఏ ప్రతినిధులు తమ అభిప్రాయలని ప్రకటించి పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ లో తెలంగాణ ప్రజలంతా అవాంతరాలన్నింటినీ దాటుకుని పాల్గొని విజయవంతం చేయాలని, ప్రజాస్వామ్య బద్దంగా, శాంతియుతంగా జరుగనున్న తెలంగాణ మార్చ్ కు రాష్టప్రభుత్వం అనుమతి నివ్వాలని, నిర్బంధ చర్య్లలను మానుకోవాలని లేదా జరిగే అవాంచనీయ సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశ పెట్టాలని, డిసెంబర్ 9 , 2009 ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చెయ్యాలని అభిప్రాయపడ్డారు.

గతవారం అమరులైన ప్రముఖ స్వాతంత్ర్యయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి గారికి ఘనంగా నివాళులర్పిచారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం కాక మునుపే బాపూజి వెళ్ళిపోయినందుకు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేసారు.. తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పాటు కాబోతుందనే ప్రగాఢ నమ్మకం వ్యక్తపరుస్తూ వేలమైళ్ళ దూరాన ఉన్నా, మనసంతా తెలంగాణ మట్టితోనే ముడివడి ఉన్న తెలంగాణ ఎనారైలు రాష్ట్రమొచ్చేదాక విశ్రమించేది లేదని ప్రతిన బూనారు.
ఇదే సమయంలో బోస్టన్ లో వెంకట్ మారోజు, అమర్ కర్మిల్లా, జలగం మురళిధర్ రావు, నాగన్న, పాపారావు గుందవరం, వెంకట్ రెడ్డి ముద్దసాని, స్వరుణ్ నబుద్దినేని, శ్రీనివాస్ మేనేని, విజయ కాకి, రామారావు బుద్ధినేని, శాంతి పుట్ట, బల్విందర్ సింగ్ , కల్యాణ్ , సుధీర్ బోయినపల్లి, రాజు తదితరులు పాల్గొన్న ‘సంఘీభావ రాలీ' విజయవంతంగా జరిగింది.

డెట్రాయిట్ లో భరత్ మాదాడి, శైలేంద్ర సనం, హరి మారోజు తదితరుల అధ్వర్యం లో తెలంగాణ ఎన్నారై లు సమావేశమై విజయవంతంగా సంఘీభావ రాలీ నిర్వహించారు. ఫిలడెల్ఫియా లో రవి మేరెడ్డి, మాధవ్ మొసర్ల , శ్రీధర్ గుడాల అధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైలు సంఘీభావ రాలీ లో పాల్గొని తెనా పిలుపును విజయవంతం చేసారు. మొత్తంగా, ఉత్తర అమెరికాలో నాలుగు ప్రధాన నగరాల్లో .తెనా అధ్వర్యంలో ‘తెలంగాణ మార్చ్ ‘ సంఘీభావ రాలీలు అత్యంత ఉత్సాహంగా విజయవంతంగా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం జరుగుతున్న ఉద్యమానికి, సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ కి తెలంగాణ ఎన్నారైలు తమ సంఘీభావాన్ని ముక్తకంఠం తో తెలిపారు.

English summary
More than hundred Telangana NRIs gathered in 4 major cities of USA to express their profound solidarity to the Telangana March to be held on September 30th in Hyderabad. Solidarity rallies were held based on a program taken up by TeNA (Telangana NRI association, USA) in Boston, Detroit, Philadelphia and New Brunswick New Jersey on September 22nd between 2PM and 6PM. These solidarity rallies turned out to be grand success, participated by hundreds of NRIs in their respective towns who raised their voices in unison and echoed their unwavering support for the Telangana March 'Chalo Hyderabad'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X