అమెరికా టీమ్‌లో తెలుగువాడు

మాస్టర్స్ ప్రపంచ కప్‌లో అమెరికా తొలిసారి పాల్గొంటుంది. ఇందులో పాల్గొనే జట్టులో శ్రీను స్థానం సంపాదించుకున్నాడు. లఘు, మధ్యతరహా కన్షార్షియం చైర్మన్ మహేందర్ ముసుకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీను చూసి తెలుగు ఎన్నారైలంతా గర్వపడాలని ఆయన అన్నారు. జీవతాంతం తమ ఆసక్తిని ఆచరణ రూపంలో ఎలా పెట్టాలో శ్రీనివాస్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు.
నాటా కమ్యూనిటీ సర్వీసెస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గనగోని శ్రీనివాస్‌ను అభినందించారు. శ్రీనివాస్ చేసిన కృషిని టిఎఫ్ఎఎస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర ప్రశంసించారు. శ్రీనివాస్ కృషికి సహకారం అందించిన కుటుంబ సభ్యులను శ్రీ గురువయూరప్పన్ ఆలయం బోర్డు టర్స్టీ మోహన్ పటబొల్ల అభినందించారు. ఆటా న్యూజెర్సీ సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి శ్రీనుతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరించారు.
నాట్స్ ప్రతినిధి వెంకట్ వీరమాచినేని శ్రీనుకు శుభాకాంక్షలు తెలిపారు. తానా సంయుక్త కార్యదర్శి వాసుదేవ రెడ్డి కూడా శ్రీనును అభినందించారు. సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రతినిధి శరత్ వేట కూడా శ్రీనును అభినందించారు. టిఎఫ్ఎఎస్ సలహాదారు దాము గేదెల కార్యక్రమంలో పాల్గొన్నారు.
పీపుల్ ఫర్ లోకసత్తా న్యూజెర్సీ చాప్టర్ ప్రతినిధులు సురేష్ ఇ, కపిల్ బి, శ్రీకర్ కె. ప్రకాశ్ కె, జయదేవ్ పి, సంతోష్ పి, సుధీర్ పి, ఆరవింద్ ఎం, రఘురామ్ టి, శ్రీనివాస్ కె, రాకేష్ సిలతో పాటు పలువురు శ్రీను నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications