వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు సాహితీ సదస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugu sahiti sadassu in USA
భారత దేశం ఎల్లలు దాటి విదేశాలలో మొట్ట మొదటి సారిగా కేవలం తెలుగు భాషా, సాహిత్య సమాలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ రాబోయే మార్చి 10-11 తేదీలలో అమెరికాలోని హ్యూస్టన్, టెక్సస్ మహానగరంలో మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లు వంగూరి ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యుడు చిట్టెన్ రాజు చెప్పారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, మధ్య ప్రాచ్య దేశాలు, భారత దేశాలనుంచి సాహితీ ప్రముఖులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. సదస్సుకు వచ్చి ఆనందించదలుకున్న వారు వెనువెంటనే నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సాహిత్య మహాసభలలో కొన్ని ప్రధానాంశాలు:

సుమారు యాభై ఉన్నత స్థాయి సాహిత్య ప్రసంగాలు.
తెలుగు భాషా, సాహిత్యాలపై కీలకమైన చర్చా వేదికలు.
స్వీయ రచనా పఠనం.
పుస్తక విక్రయ శాల.
అందరూ పాల్గొనే సరదా సాహిత్య పోటీలు.
యువతరం వేదిక.
తెలుగు ఉపాధ్యాయుల సత్కారం.
శ్రీ నందన నామ సంవత్సర ఉగాది ఉత్తమ రచన విజేతల పురస్కారం.
పది పుస్తకావిష్క్రరణలు.
ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారాలు.

English summary
Vanguri foundation is organizing Telugu literary conference in USA on March 10 and 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X