వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో ఉగాది సంబరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ugadi celebrations in USA
గ్రేటర్ చికాగో తెలుగు సంస్థ ఈ నెల 24వ తేదీన ఉగాది, శ్రీరామ నవమి కార్యక్రమాలను శ్రీరామాలయంలో కనులవిందుగా నిర్వహించింది. కార్యక్రమానికి 800 మందికి పైగా హాజరయ్యారు. తెలుగు సాంస్కృతిక కట్టుబాట్లకు, పూర్వ సంస్కృతీ ఆచారాలకు అనుగుణంగా ఈ సంబరాలను నిర్వహించారు. గణపతి ప్రార్థనతో, స్థానిక రామాలయం పూజారి నరసింహాచారి సముద్రాల పంచాంగ పఠనంతో కార్యక్రమాలను ప్రారంభిచారు. గ్రేటర్ చికాగో తెలుగు సంస్థ అధ్యక్షుడు కళ్యాణ్ ఆనందుల మొదట ఉగాది, శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

సంస్థ నలుబది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 14వ తేదీన సంగీత, నృత్య కార్యక్రమాలను ప్రత్యేకంగా, ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి సంబరాల్లో భాగంగా సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు వక్తలుగా పదమ్, కిరణ్ అబ్బరాజు, మణి తెల్లప్రగడ వ్యవహరించారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడి ప్రత్యేకతలు తెలిపే పాటలతో ఆడిపాడారు. కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ, ఏకీకరణ, జానపద కళ ప్రత్యేక నృత్యాలను పిల్లలు, పెద్దలు చేశారు. సోనియా, లోప, అపరూ నృత్యాలను రూపొందించారు.

సంస్థ సాంస్కృతిక కార్యదర్శి సుజాత అప్పలనేని, మాలతీ దామరాజు, శిరీష్ కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేశారు. అంజి కందిమళ్ల, నరేందర్ చేమర్ల, ప్రదీప్ కందిమళ్ల, రమేష్ గారపత్య, సత్యనారాయణ కొండపాలి, శ్రీనివాస్ పెదమల్లు,త సామ రామిరెడ్డి, మూర్తి పీసపాటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి సేవలందించారు. అమెరికా తెలుగు సంస్థ కార్యనిర్వాహకులు కరుణాకర్ మాధవరం, సత్యనారాయణ కందిమళ్ల అట్లాంటాలో జూలై 6,7,8 తేదీల్లో నిర్వహించే తెలుగు సమ్మేళనం గురించి వివరించారు. చివరగా నిర్వహించిన అంత్యాక్షరి అందరినీ ఆకట్టుకుంది. అంజి కందిమళ్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

English summary
Telugu Association of Greater Chicago has performed Ugadi and Srirama Navami festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X