షర్మిల పాదయాత్రకు ఎన్నారైల మద్దతు

షర్మిల పాదయాత్రకు సంఘీభావంగా ఆయన ఆ పనిచేశారు. షర్మిల పాదయాత్ర అక్టోబర్ 18వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభమైంది. వీరారెడ్డి నంద్యాల విడుదల చేసిన వాణిజ్య ప్రకటన డిసెంబర్ 3వ తేదీన ప్రసారమైంది.
షర్మిల పాదయాత్రను సాహసంతో కూడిన చర్యగా ఆయన అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని షర్మిల గుర్తుకు తెస్తున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందుకు పూనుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందం కారణంగానే చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని ఆయన విమర్శించారు. మరో ప్రజా ప్రస్థానం పూర్తయ్యే వరకు ప్రసారమయ్యే షర్మిల పాదయాత్ర వాణిజ్య ప్రకటనకు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications