లండన్‌లో అబేండ్కర్ జయంతి
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం జై భారత్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ ఆదివారంనాడు అంబేడ్కర్ జయంతి జరిగింది. ముందుగా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అందించిన స్ఫూర్తిని, ఆయన ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారై ముఖ్య సభ్యుడు చందూ గౌడ్ చిక్క అధ్యక్షత వహించారు.

గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచలం, రంగుల సుధాకర్, ప్రమోద్, అశోక్ దూసరి, మల్లారెడ్డి తదితరులు ప్రసంగించారు. చిన్న రాష్ట్రాలు, అంబేడ్కర్ ఆశయం అనే అంశంపై వక్తలు మాట్లాడారు. అంబేడ్కర్ చిన్న రాష్ట్రాల ఆశయ సాధనకు ముందుకు రావాలని వారు కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని వారన్నారు.
దేశం భిన్న జాతులు, మతాలు, వర్గాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించాడని వారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరికీ ఆదరణీయుడు, చిరస్మరణీయుడని వారు ప్రశంసించారు.
అంబేడ్కర్ ప్రతి భారతీయుడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాడని వారు కొనియాడారు. హరీ నవీపేట, మహేష్ నిక్కీరావు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.












Click it and Unblock the Notifications