వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్ విక్టిమ్‌కు లండన్‌లో నివాళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Delhi Gang Rape: Protest in London
లండన్: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి లండన్ ఎన్నారైలు కదిలిపోయారు. ఆమెకు సంఘీభావంగా తలపెట్టిన ప్రదర్శన కాస్తా విషాద ప్రదర్శనగా మారిపోయింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌నకు నిరసనగా లండన్ ఎన్నారైలు ఈ నెల 29వ తేదీన వ్రదర్శన నిర్వహించారు. బాధితురాలు మరణించినట్లు సమాచారం అందడంతో మాటలు రాని విషాదంలో మౌనం దాల్చారు.

లండన్‌లోని టవిస్టాక్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎన్నారైలు ప్రదర్శన నిర్వహించారు. ప్రవాసి భారతి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. వందలాది మంది ఎన్నారైలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గుమికూడి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బాధితురాలి మృతికి సంతాపసూచకంగా కొద్దిన నిమిషాలు మౌనం పాటించారు.

గ్యాంగ్‌ రేప్‌నకు నిరసనగా సేకరించిన సంతకాలతో ఓ వినతిపత్రాన్ని భారత కమిషన్‌కు సమర్పించారు. రేపిస్టులను శిక్షించడానికి పకడ్బందీ చట్టం చేయాలని వారు కోరారు. లైంగిక దాడుల కేసుల విచారణ వేగవంతంగా జరగడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రవాసి భారతి తరఫున నాగేందర్ చిందం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో మరణించిన విషయె తెలిసిందే. ఆ సంఘటన విదేశాల్లోని ఎన్నారైలను విపరీతంగా చలింపజేసింది.

English summary
Hundreds of Non-Resident Indians Gathered Mahatma Gandhi Statue, Tavistock Square, London and held candle lit vigil. Few minute Silence - Homage to Delhi rape victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X