హిందూ మత గురువుకు జైలు

గాడియా వైష్ణవ సంఘం (జీవీఎస్) అనే సంస్థను స్థాపించిన హల్దార్, విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వకీ నగరంలో ఒక ఆలయాన్ని నెలకొల్పారు. హల్దార్ సుమారు పాతిక మంది భారతీయులకు ఆర్-1 వీసాలుగా పిలిచే మత కార్యకర్త వీసాలను మోసం చేసి ఇప్పించడానికి ప్రయత్నించారని అభియోగం మోపారు.
వీరందరినీ మిల్వకీలోని జీవీఎస్ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే పేరిట అమెరికాలోకి తీసుకు రావాలని హల్దార్ ప్రయత్నించారు. 2010 జూన్‌లో హల్దార్ షికాగోలో అడుగుపెట్టగానే ఆయన లగేజీలో దీనికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.
హల్దార్ తీసుకుని వచ్చినవారికి మతరకమైన శిక్షణ లేదని, అనుభవం కూడా లేదని కోర్టు తేల్చింది. పూజారులుగా స్థిరపడి, పుజాధికాలు నిర్వహించే ఉద్దేశం కూడా వారికి లేదని చెప్పింది. అమెరికాకు వచ్చిన తర్వాత వారు ఆ విషయం చెప్పారని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications