భారతీయుడికి 17 ఏళ్ల జైలు

Indian-American jailed for 17 years for healthcare fraud
వాషింగ్టన్: హెల్త్ కేర్ ఫ్రాడ్‌ కేసులో ఓ ఇండియన్ అమెరికన్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. వ్యాధి లేకున్నా ఉన్నట్లు నకిలీ రోగుల దొంగ రోగాలకు డాక్టర్లతో తప్పుడు ప్రిస్క్రిప్షన్లు రాయించి, దొంగ బిల్లులు పెట్టిస, ఏకంగా అమెరికా ప్రభుత్వానికే టోపీ పెట్టబోయి అమెరికా అధికారులకు పట్టుబడ్డాడు ఆ ఇండియన్ అమెరికన్. వైద్యబిల్లు కుంభకోణానికి పాల్పడి 17 ఏళ్ల శిక్షకు గురై ఇప్పుడు జైలు పాలయ్యాడు. బహుభాయ్ (బాబ్) పటేల్ అనే వయసు 50 ఏళ్ల అతను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.

అమెరికాలోని డెట్రాయిట్‌లో ఆయనకు 26 మందుల దుకాణాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం అక్కడి పేద ప్రజలకు, వృద్ధుల కోసం మెడికేర్, మెడిక్ఎయిడ్ అనే రెండు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ పథకంలో ఉన్న లోపాలను పసిగట్టిన బహుభాయ్ పటేల్ వైద్యులతో కుమ్మక్కై కుంభకోణానికి తెర తీశాడు. 2006-2011 మధ్యకాలంలో రూ.300 కోట్ల మేర బిల్లులు పెట్టాడు. వాటిలోని 25 శాతం బిల్లులు నకిలీవే. అయితే, అక్కడి అధికారులు పటేల్ మోసాన్ని కాస్తా ఆలస్యంగా గుర్తించారు.

అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు 17 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. అంతేకాదు, ప్రభుత్వానికి టోపీ పెట్టి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.92 కోట్ల మేర తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదే పద్ధతిలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ బ్లూక్రాస్ బ్లూషీల్డ్‌ను కూడా మోసం చేసినందున, ఆ సంస్థకు రూ.55 కోట్ల మేర తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసులో పటేల్‌కు సహకరించిన బ్రిజేష్ రావల్, అశ్విని శర్మ, లోకేష్ తయాల్‌లకు కోర్టు 68 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని మళ్లీ అమెరికాకు రాకుండా చేసి, జైలు నుంచే నేరుగా వారి స్వదేశాలకు తరలించనున్నారు. వీరిలో బ్రిజేష్ కెనడావాసి కాగా, మిగతా ఇద్దరూ భారతీయులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+