గర్ల్ ఫ్రెండ్ హత్య: అతను దోషే

అతనికి కింది కోర్టు నిరుడు జులైలో పెరోల్‌కు అవకాశం లేకుండా 35 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. తన మాజీ ప్రియురాలు నీలిమా సింగ్ (24)ను, ఆమె తోబుట్టువులు కునాల్ (18), సిధి (12)లను హత్య చేసిన కేసులో అతనికి ఆ శిక్ష పడింది. ఈ హత్యలు 2003లో జరిగాయి.
కింది కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు జాన్ మూయిర్, రాబర్ట్ గాటర్సన్, పీటర్ అపిల్‌గార్త్ సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. విచారణ సందర్భంగా సోమవారం సికా కోర్టులో లేడని తెలుస్తోంది.
సికా సంఘటన స్థలంలో వదిలిన పాదముద్రలకు నిపుణుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ తీర్పుతో సికా కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము దేశ హైకోర్టుకు వెళ్తామ ని చెప్పారు. తాము సమరంలో ఓడామని,త యుద్ధంలో ఓడలేదని సికా తండ్రి అన్నాడు.












Click it and Unblock the Notifications