భారత్‌కు క్రాంతి బాడీ: ల్యాప్‌టాప్‌లో చూసి రోధించిన భార్య

దీంతో అంత్యక్రియల సమయంలో వరంగల్ జిల్లాలోని బంధువులు లాప్‌టాప్ సహాయంతో అమెరికాలోని వాణితో మాట్లాడారు. ల్యాప్‌టాప్ ద్వారా భర్త మృతదేహాన్ని చూసిన వాణి రోదించింది. ఈ సన్నివేశం చూసిన పలువురిని కలిచివేసింది. బంధువులు ఎంతగా చెప్పినా వాణి వెక్కి వెక్కి ఏడ్వటం అందర్నీ కలిచివేసింది.
కాగా అమెరికాలో వారం రోజుల క్రితం న్యూయార్కులోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్న వరంగల్ జిల్లా వాసి క్రాంతికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని భార్య వాణి. వాణిది వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్ గ్రామం కాగా క్రాంతిది నల్లబెల్లి మండలం నందిగామ.
క్రాంతికుమార్‌ను భారత్ రప్పించేందుకు బంధువులు పలువురు రాజకీయ నేతలను కలిశారు. పలువురి సహకారంతో క్రాంతికుమార్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చి అంత్యక్రియలు జరిపారు.












Click it and Unblock the Notifications