లాటా ఉగాది ఉత్సవాలు

Los Angeles Telugu Association (LATA) Ugadi Celebrations
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా ) అంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలని ఈ నెల 20వ తేదీన లాంగ్ బీచ్, కాలిఫోర్నియా లో జరుపుకున్నది. లాటా చేపట్టిన మొదటి కార్యక్రమమైనా అద్బుతమైన ప్రజాదరణ పొందింది. ఈ కార్యక్రమానికి 600 మందికి పైగా విచ్చేశారు. అందులో చాలా మంది వార్షిక, జీవిత సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు , చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి భరత్ పొట్లూరి బృందం వచ్చిన అతిధులందరికీ విందు భోజనం అందించారు.

లాటా సాంస్కృతిక బృందం వారు రవి తిరువైపాటి, సమీర్ భవానిభట్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, సుష్మిత గోపవరపు గణనాథుని ప్రార్థనతో సత్య దువ్వూరి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు . ఉగాది సందర్భంగా నరసింహాచార్య గారు పంచాంగ పఠనం చేసారు. శంకరా నాద శరీరాపరా అంటూ శబరి గిరీష్ ఆలపించగా, శ్రీకాంతి గుంటూరి, శ్రావణ్ మొక్కపాటి రాముని గానంతో అలరించారు. కోకిల బృందం వారు శ్రీరామరాజ్యం చలన చిత్రం లో గానం తో పాటు అద్బుతమైన గాన కదంబాన్ని అందించారు.

లాటా అధ్యక్షుడు రమేష్ కోటమూర్తి, కార్యాచరణ బృందం తిలక్ కడియాల, హరి మాదాల, లక్ష్మీ చిమట, శ్రీని కొమరిసేట్టి లాటా ఆశయాలు , భవిష్యత్తులో చెయ్యబోయే కార్యక్రమాలను వివరించారు. ఆంధ్ర రాష్ట్ర చిత్ర ప్రముఖులు సినారె, తనికెళ్ళ భరణి, దీక్షితులు, అలాగే ప్రముఖ వ్యాఖ్యత సుమ లాటాకు అభినందనలు తెలిపారు.

స్వప్నశ్రీ బృందం చిన్నారులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకోగా , సంగమం స్కూల్ వారు దక్షిణ భారత దేశంలో వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అదివో అల్లదివో అంటూ నృత్యం చేసిన రేణుక మాలేపాటి శిష్య బృందం ప్రేక్షకుల మన్నన లని పొందారు. లాటా వారు నిర్వహించిన వక్తృత్వ పోటీలలో ముందుగా నిలిచిన వారికి ముఖ్య అతిధులు రవీందర్ రెడ్డి తాడిపర్తి, రాజేష్ కొత్తపల్లి, రాయుడు కొత్తపల్లి, సుబ్బా గోపవరపు బహుమతులు అందించారు

సంప్రదాయ నృత్యాలే కాక ఇటీవల చిత్రాల పాటల నృత్యాలతో యువతను ఉర్రూతలెక్కించారు జ్యోతి పచ్నూరి. చిన్నారులు రితిక, అనన్య, శ్రేయ, హారిక కూడా తమ నృత్యం తో అలరించారు. బుజి బుజి రేకులు అంటూ తెలుగు తోట చిన్నారులు వరకట్నం వ్యతిరేకిస్తూ చేసిన నృత్య నాటిక అందరిని ఆకట్టుకుంది. సంగమం అకాడమి వారి తెలుగు పాటల కదంబం ఎంతో వీనుల విందుగా సాగింది . శ్రేయ మల్హోత్రా చేసిన బాలీవుడ్ నృత్య కదంబం ఒక మెరుపులా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి తోడ్పడిన కార్యకర్తలకి, దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపారు ప్రసాద్ పపుదేసి, లక్ష్మి చిమట. అమెరికా, భారత జాతీయ గీతాలతో కార్యక్రమాన్ని ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+