పోలీసు కస్టడీలో మృతి: సస్పెన్షన్

మలేసియా స్టార్ వార్తాకథనం ప్రకారం - కౌలాలంపూర్‌లోని పోలీసు కేంద్ర కార్యాలయంలో మే 21వ తేదీన ఎన్ ధర్మేంద్రన్ అనే 32 ఏళ్ల భారత సంతతి వ్యక్తి మరణించాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు పోలీసులను గత వారం డెస్క్ వర్క్‌కు పరిమితం చేశారు.
అయితే, ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేయకపోతే ఆందోళనకు దిగుతాామని భారత ఎన్జీవోలతో పాటు పలు గ్రూపులు హెచ్చరించాయి. కస్టడీలో మరణాలను తాము సహించబోమని హమీదీ చెప్పారు. ఆందోళనలు అవసరం లేదని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కౌలాలంపూర్‌లోని బందర్ తున్ రజాక్ ప్రాంతంలో మే 11వ తేదీన జరిగిన కాల్పుల సంఘటనపై విచారణ నిమిత్తం సహకరించడానికి లారీ డ్రైవర్ ధర్మేంద్రన్‌తో పాటు మరో ముగ్గురిని మే 13వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల సంఘటనలో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు గాయపడ్డారు.
తనకు ఛాతీ నొప్పి వస్తుందని ధర్మేంద్రన్ ఫిర్యాదు చేశాడు. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు తేలింది. పోలీసు కస్టడీలో ఉండగానే అతను మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది.












Click it and Unblock the Notifications