వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైకి మిలియన్ డాలర్ల ప్రైజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sugata Mitra
వాషింగ్టన్: మురికివాడల పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించడానికి హోల్ ఇన్ ద వాల్ పేర ప్రయోగం ద్వారా చరిత్ర సృష్టించిన ప్రవాస భారతీయుడు డాక్టర్ సుగత మిత్రాకు మిలియన్ డాలర్ల టెడ్ బహుమతి దక్కింది. యుకెలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్‌గా డాక్టర్ సుగత మిత్రా పనిచేస్తున్నారు.

అత్యంత ప్రతిభావంతమైన, ప్రభావితమైన ప్రాజెక్టుల్లో కృషి చేసిన వ్యక్తులకు టెడ్ బహుమతిని యేటా ప్రదానం చేస్తారు. విద్యా పఠనానికి స్వయంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబాలకు, పాఠశాలలకు స్వయం నిర్దేశిత అభ్యాసానికి చెందిన పరికరాల గ్లోబల్ ఇన్షియేటివ్ కోసం తమ బహుమతి మొత్తాన్ని ఖర్చు చేస్తానని సుగత మిత్రా చెప్పారు.

తన హోల్ ఇన్ ద వాల్ (గోడలో రంధ్రం) అనే ప్రయోగం ద్వారా మిత్రా క్లౌడ్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు. తన పరిశోధక కేంద్రం నుంచి పక్కనే ఉన్న ఢిల్లీ మురికివాడకు రంధ్రం చేసి, అందులో సులభంగా కదలగలిగే కంప్యూటర్‌ను పెట్టారు. ఆంగ్లభాషలో ఏ మాత్రం పరిజ్ఞానం లేని వీధి పిల్లలు దాని ద్వారా సులభంగా కంప్యూటర్ వాడకాన్ని నేర్చుకున్నారు. 1999లో ఆయన ఈ పనిచేశారు.

తన పరిశోధన ద్వారా పదేళ్లలో గ్రానీ క్లౌడ్‌ను సృష్టించారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్ మోడరేటర్స్‌గా బోధనా సెంటర్లలో ఇంటర్నెట్ టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు, అసైన్‌మెంట్స్ ద్వారా ప్రోత్సహించే పద్ధతిని అమలు చేశారు. ఆ రకంగా ఆయన స్వయం నిర్దేశిత అభ్యసనను మిత్రా ప్రచారంలోకి తెచ్చారు.

English summary
An NRI education pioneer, known for his innovative "hole-in-the-wall" experiment to give computer education to slum children, has been awarded with the prestigious USD 1 million TED prize.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X