విద్యార్థులకు ఎన్నారైల నోట్ బుక్స్

 NRI Telangana forum distributes note books
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం తెలంగాణ ప్రాంత చారిటీ కార్యక్రమంలో భాగంగా అక్షరం ద్వారా పేద విద్యార్థులకు మొదటి విడతగా 5 వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని లండన్ తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

మెదక్ జిల్లా కౌడిపల్లి మడలం పూజాబాద్ గ్రామంలో ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ దేశంలో ఉన్నా తమ మాతృభూమిని మరిచిపోకుండా తమ మమకారాన్ని చాటుతున్నారని, అది తెలంగాణ గొప్పదనమని నందిని సిధారెడ్డి అన్నారు.

ఇలా అందరూ పరస్పరం సహకరించుకుని విద్యారంగంలో ఉన్నతస్థాయికి చేరి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడాలని ఆయన సూచించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకుడు రంగాచారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటాలని ఆయన అన్నారు.

జెఎన్‌టియు హైదరాబాద్ జెఎసి అధికార ప్రతినిధి తాళ్లపల్లి సురేందర్ కూడా మాట్లాడారు. విద్య ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ వెంకటకృష్ణయ్య, ప్రసాదరావు, వెంకటేష్, నవీన్, దాస్, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+