బయ్యారం ఫైట్‌కు ఎన్నారైల మద్దతు

 T - JAC Bayyaram fight
బహ్రెన్: బయ్యారం ఉక్కు కోసం తెలంగాణ జెఎసి చేపట్టిన పోరాటానికి బహ్రెన్‌లోని ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. బహ్రెన్‌లో మంగళవారం తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రథమ వార్షికోత్సవం జరిగింది. రాధారాపు సతీష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.

తెలంగాణ ఉద్యమానికి ఎన్నారైల మద్దతు ఎప్పటికీ ఉంటుందని, అదే సమయంలో తెలంగామలో సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతామని బహ్రెన్ ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ నాయకత్వంలో ప్రారంభమైన బయ్యారం ఉక్కు పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు రాధారపు సతీష్ చెప్పారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని సతీష్ చెప్పారు. కేక్ కట్ చేసి ఉత్సవాలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో రమేష్ రాజు, ఏడుకొండలు, శ్రీధర్, రహీమ్, విజేందర్, కిశోర్ పాల్గొన్నారు. తెలంగాణలో బలిదానాలను అపడానికి కృషి చేస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+