ఫొటోలు: దుబాయ్ కొత్త వత్సరం వేడుకలు
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్ దుబాయ్ విచ్చేసిన సందర్భంగా ప్రవాసాంధ్రుల ఆహ్వనం మేరకు స్థానిక ఇండియా క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
దుబాయ్‌లోని వ్యాపారవేత్తలు గణేష్ రాయపూడి, పసుమర్తి హనుమతురావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు, మంత్రులు ఉత్సాహంతో చర్చాగోష్ఠిలో పాల్గొని వారు నిత్యం ఎదుర్కొటున సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా శాశ్వత ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఈ కార్యక్రమానికి సుంకు సాయి ప్రకాష్, జూలూరు సురేష్, శ్రీమతి పబ్బా మాధవి సహాయ సహాకారాలు అందించారు. స్థానిక తెలుగు సంఘం ప్రతినిధులు, వాసవి కృప కమిటీ సభ్యులు, దుబాయ్‌లోని తెలుగు ప్రముఖులు హాజరై జయప్రదం చేశారు. ఆంధ్ర వంటకాలతో విందును ఏర్పాటు చేశారు.

దుబాయ్‌లో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఉల్లాసంగా రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్..

దుబాయ్ ఎన్నారైలతో రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్....

కొత్త సంవత్సరం వేడుకల్లో దుబాయ్ ఎన్నారై మహిళలు ఆనందంగా...

ఎన్నారైలతో రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ ఇలా....

దుబాయ్ ఎన్నారైల మాటలను శ్రద్ధగా వింటున్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, విశ్వరూప్.












Click it and Unblock the Notifications