వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో భారత్ రిపబ్లిక్ డే

By Pratap
|
Google Oneindia TeluguNews

 Republic day celebrations at London
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో భారత 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇలా లండన్‌లో భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఇదే ప్రథమం. ఈ వేడుకల్లో భారత ఎన్నారైలు పలువురు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపక సభ్యుడ గంప వేణుగోపాల్ జాతీయ పతాకను ఆవిష్కరించారు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించారు.

భారతదేశం భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఆయన గుర్తు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థ సాధించిన విజయాలను, సాధించాల్సిన విషయాలను వివరించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కూర్మాచలం ప్రశంసించారు. భారత ప్రజల ఐక్యతను, యువచైతన్యాన్ని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ సాధన కోసమే కాకుండా దేశం ఎదుర్కుంటున్న ఇతర సమస్యలపై తాము పోరాటం చేస్తామని తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు చెప్పారు. జై భారత్ విభాగం ద్వారా ఎన్నారైలకు ఆధార్ కార్డులు ఇప్పించడానికి తాము కృషి చేస్తామని, ఎన్నారైల ఓటింగ్ విధానంపై కూడా పోరాటం చేస్తామని అనిల్ కూర్మాచలం చెప్పారు.

ప్రముఖ గాయకుడు సంపత్ కూతురు బేబీ శ్రీయ ఆలపించిన జాతీయ గీతం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరవై ఐదున్నర ఏళ్ల స్వతంత్ర భారత దేశంపై ఇష్టాగోష్టిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు, వెంకట్ రంగు, తిరుపతి, నగేష్, హరి, అశోక్, సృజన్, జయకుమార్, ప్రభాకర్ ఖజా, శ్యాం, వినోద్, చందూగౌడ్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

English summary

 Telangana NRI forum has organised Indian republic day celebrations at London. Telangana NRI forum founder member Gampa Venugopal has hoisted national flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X