వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల్య స్నేహితురాలికి వేధింపులు: టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie arrested for harassing childhood buddy
హైదరాబాద్: యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చిన ఓ టెక్కీని నేర పరిశోధన విభాగం (సిఐడి) అధికారులు అరెస్టు చేశారు. బెంగళూర్ విమానాశ్రయంలో అతన్ని అరెస్టు చేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో బాల్య స్నేహితురాలిని వేధించిన కేసులో వెంకట నాగ శివ ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

గుంటూరు జిల్లాకు చెందిన వెంకట నాగ శివ ప్రసాద్ తన బాల్య స్నేహితురాలిని పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాల రోజుల నుంచి ఇరువురి మధ్య పరిచయం ఉంది. డిగ్రీ కూడా ఒక చోటే చేశారు. ఇంజనీరింగ్ పైనలియర్‌లో ఉన్నట్లు అతను పెళ్లికి ప్రతిపాదన చేశాడని, ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించిందని సిఐడి అధికారులు చెబుతున్నారు.

అమ్మాయికి పెళ్లి అవుతోందని తెలుసుకున్న శివ ప్రసాద్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటానని కూడా అతను బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసింది బాధితురాలి పేరు మీద బూటకపు ప్రొఫైల్ రూపొందించి, మార్ఫ్ చేసిన ఆమె ఫొటోలను కాబోయే భర్తకు పంపించాడని శివప్రసాద్‌పై ఆరోపణ.

ఓ బహుళ జాతి కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్ కొద్ది కాలం క్రితం యునైటెడ్ కింగ్‌డమ్ వెళ్లాడు. అతను భారతదేశానికి తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న సిఐడి అధికారులు బెంగళూర్ విమానాశ్రయంలో ఈ నెల 6వ తేదీన పట్టుకుని బుధవారం అరెస్టు చేశారు.

English summary
Crime Investigation Department (CID) sleuths have arrested a stalker at the Bangalore airport moments after he arrived from the United Kingdom for circulating morphed photographs of a childhood friend on social networking sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X