బాల్టిక్ సీలో పడి టెక్కీ మృతి

Baltic Sea
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌కు చెందిన టెక్కీ స్వీడన్ బాల్టిక్ సీలో గల్లంతయ్యాడు. స్వీడన్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబ సభ్యులతో కలిసి వారాంతం వినోదం కోసం వెళ్లి అందులో మునిగిపోయాడు. దాంతో అతని భార్య దిగ్భ్రాంతికి లోనై స్పృహ తప్పి పడిపోయింది. వారి మూడేళ్ల కూతురు ఫోస్టర్ సంరక్షణలో ఉంది.

బెంగళూర్‌లోని బసవనగుడికి చెందిన జయప్రకాష్ నర్సింహయ్య అనే 30 ఏళ్ల టెక్కీ విప్రో టెక్నాలజీస్ స్వీడిష్ శాఖలో సిస్టమ్స్ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. స్టాక్‌హోమ్‌లో అతను భార్య అనుపమ, కూతురు సృష్టితో కలిసి జీవిస్తున్నాడు. స్టాక్‌హోమ్‌కు 24 కిలోమీటర్ల దూరంలో గల గ్రిస్లింగే బీచ్ రిసార్ట్‌కు ఆ కటుంబం జులై 6వ తేదీన వెళ్లింది. సముద్రంలో స్నానాలు చేసే చోట కూతురితో కలిసి జయప్రకాష్ ఆడుకుంటున్న సమయంలో ముప్పు వాటిల్లింది. భర్త నీటిలో మునగడంతో సహాయం కోసం అనుపమ స్టాక్ హోమ్ పోలీసులను కోరింది.

పోలీసులు గజఈతగాళ్లను నియోగించారు. వారు జయప్రకాష్ శవాన్ని బయటకు తీశారు. అస్పత్రిలో శవాన్ని చూసి అనుపమ స్పృహ తప్పిపడిపోయింది. నాలుగు రోజుల పాటు జయప్రకాష్ పనికి రాకపోవడంతో బెంగళూర్‌లోని కుటుంబ సభ్యులను సంప్రదించారు. అనుపమకు స్పృహ రాకపోవడంతో పోలీసులు స్థానిక సాఫ్ట్‌వేర్ సంస్థలను సంప్రదించి, మరణించిన వ్యక్తిని జయప్రకాష్‌గా నిర్ధారించారు.

సంఘటన జరిగిన ఆరు రోజులకు జయప్రకాష్ తమ్ముడు హరి స్వీడన్ బయలుదేరి వెళ్లాడు. విప్రో అధికారులు జయప్రకాష్ మరో సోదరుడు రవికిరణ్‌ను సంప్రదించి, ఆస్పత్రి వర్గాలు తమను లోనికి అనుమతించడం లేదని, అనుపమతో కలిసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+