వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెనా అధ్యక్షుడిగా వెంకట్, చైర్మన్‌గా స్వామి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana NRI Association
ఫిలడెల్ఫియా: తెలంగాణ కమ్యూనిటీ అభివృద్ధి కోసం, సాంస్కృతిక పరిరక్షణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ఎన్నారై సంఘం (తెనా) కొత్త కార్యవర్గం ఏకీగ్రవంగా ఎన్నకైంది. వెంకట్ మారోజు నూతన అధ్యక్షుడిగా, స్వామి వెంకటయోగి బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మాజీ చైర్మన్ రవి మేరెడ్డి, కన్వీనర్ హరి మారోజు గత నాలుగేళ్ల పాటు పనిచేశారు. వారు బోర్డులో కొనసాగుతూ కార్యవర్గంలో ఉంటారు.

తెనా ఉపాధ్యక్షుడిగా అమర్ కర్మిల్ల, ప్రధాన కార్యదర్శిగా సుమంత్ గరకరాజుల, కోశాధికారిగా రాజేందర్ కాల్వల ఎన్నికయ్యారు. శ్రీనివాస్ కొంపల్లి సంయుక్త కార్యదర్శిగా, హరి పరాంకుశం సంయుక్త కోశాధికారిగా సేవలు అందిస్తారు.

సంఘం నిర్మాణానికి, పటిష్టతకు దాని స్థాపన నుంచి రవి మేరెడ్డి ఎనలేని కృషి చేశారని స్వామి వెంకటయోగి ప్రశంసించారు. తన ముందు పెద్ద బాధ్యత ఉందని, అంకిత భావంతో తాను పనిచేస్తానని ఆయన అన్నారు. సమాజం పట్ల నిబద్ధతతో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తాను పనిచేస్తానని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతు పాత్ర నిర్వహించడానికి తమ సంస్థ వెనకాడబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా తన అస్తిత్వాన్ని చాటుకుంటోందని, తమ సంస్థ అమెరికాలోనూ భారతదేశంలోనూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ సేవలు అందిస్తుందని వెంకట్ మారోజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సంస్కృతీఅస్తిత్వాల కోసం తమ సంస్థ విశేష కృషి చేసిందని రవి మేరెడ్డి అన్నారు. హరి మారోజు తమ బోర్డు చేసిన కృషిని వివరించారు.

సమావేశంలో శైలేంద్ర సానం, విక్రం రౌతు, విష్ణు మాధవరం, రామ్మోహన్ సురనేని, భరత్ యెడ్మా, సిద్ధార్థ పాములపర్తి, రఘుి వీరబెల్లి, హరికృష్ణ వంగల పాల్గొన్నారు.

English summary
Telangana NRI Association (TeNA), a registered non-profit multi-cultural organization working toward the development and cultural aspects of Telangana community in the US and abroad today announced unanimously elected new executive body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X