విద్యార్థులకు తెలుగు సంఘం చేయూత

ప్రతిభ గల పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి, పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించడానికి, వివిధ జిల్లాల్లో శుద్ధమైన మంచినీటి సరఫరా సౌకర్యాలు కల్పించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నాటా అధ్యక్షుడు సంజీవ టి. రెడ్డి సోమవారంనాడు చెప్పారు.
దాదాపు 6 వేల సభ్యులు గల తమ సంఘం సేవా డేస్ కింద చేపట్టే ప్రాజెక్టులో భాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాము పేద విద్యార్థులకు సహాయం చేస్తామని,త ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న ప్రతిభ గల విద్యార్థులను గుర్తించామని, తాము వారిని స్పాన్సర్ చేయడం ప్రారంభిస్తామని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని సోదరసోదరీమణులకు సహాయం అందించడమే తమ లక్ష్యమని ఆనయ చెప్పారు. నాటా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. సంజీవ టి రెడ్డి జనవరిలో నాటా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉత్తర అమెరికాకు వచ్చే తెలుగు ప్రజల కోసం తాము హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలుగు విద్యార్థుల కోసం త్వరలోనే మెడికల్ హెల్ప్‌లైన్, ఐటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications