చికాగోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు
చికాగో: అమెరికాలోని చికాగోలో ఈ నెల 13వ తేదీన ఎల్జిన్ హైస్కూల్లో ఉగాది సంబరాలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, అలనాటి దూరదర్సన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ముఖ్య అధితులుగా విచ్చేశారు.
వీరిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో అద్యక్షుడు రమేష్ గారపాటి, అమెరికా తెలుగు అసోసియేషన్ అద్యక్షుడు కరుణాకర్ మాధవరం, హనుమంతరెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు.

మాపల్లె అనే శీర్షికతో శ్రీమతి ప్రసూన వూట్ట్కుర్, విద్యార్థులు చేసిన నృత్యం అందరినీ అలరించింది. ఐకమత్యమే మహాబలమని చాటి చెప్పుతూ యూత్ కమిటీ ఒక నాటిక ప్రదర్శించింది. దీనికి వాణి దిట్టకవి, కిరణ్ మట్టె, భార్గవి నెట్టెం సహకారం అందించారు.
సంపూర్ణ రామాయణం
లోని ఓ రామయ్య తండ్రి పాటకు చిన్నారులు చేసిన నృత్యం, రవి తోకల చేసిన పడవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ పలు చిత్రాలలోని పాటలను ఎంచుకొని చిన్నారులు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి రాజి కోటంరాజు సమన్వయం
చేశారు. డాన్స్ఎలెమెంట్స్ వారు ప్రదర్శించిన నృత్యం కార్యక్రమనికే వన్నె తెచ్చింది.
మిమిక్రి రమేష్ ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన హాస్యవినోదం అందించారు. 6000 కి పైగా ప్రదర్శనలు ఇచ్చిన మిమిక్రి రమేష్ గారికి టిఏజిసి అధ్యక్షులు రమేష్ గారపాటి, కార్యవర్గం ధ్వని అనుకరణ తపస్వి అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.
ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కల్చరల్ చైర్ మాలతి దామరాజు, కో చైర్ శివ పసుమర్తి, సాయి రవి సూరిభోట్ల తమ వంతు కృషిని అందించారు. సాయి గొంగాటి , పద్మాకర్ దామరాజు సాంకేతిక సహకారం అందించారు. టిఏజిసి నిర్వహించిన పలు క్రీడాకార్యక్రామాలలో విజేతలను
క్రీడాకార్యదర్శి ప్రదీప్ కందిమళ్ళ వేదికపైకి ఆహ్వానించగా శతమ్మారెడ్డి భారద్వాజ చేతుల మీదుగా ప్రతి విభాగంలోని ముగ్గురు ఉత్తమ క్రీడాకారులకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందించారు.
ఉగాదిపచ్చడితో అందించిన విందుభోజనం అందరినీ మెప్పించింది. 12మంది ప్రముఖ భారతీయ మహిళల చిత్రాలతో వర్ణభరితంగా రూపొందించిన విజయనామ సంవత్సర తెలుగు క్యాలెండర్ ను శ్రీనివాస్ పెదమల్లు తయారు చేయించి సభ్యులందరికి అందించారు.












Click it and Unblock the Notifications