వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Madhavaram
వాషింగ్టన్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో "ఆటా మహిళా దినోత్సవం" గా, మార్చ్ నెలలో, అమెరికాలోని వివిధ నగరాల్లో పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భం గా ఆసక్తిని ప్రేరేపించే వివిధ అంశాలపై ఆటా ద్రుష్టి కేంద్రీకరించింది.

తెలుగు మహిళా విజయగాధలు, తెలుగు యువతకు ప్రేరణ కలిగించే అంశాలు, మహిళా గుర్తింపు- అభినందన, సంఘటిత సంస్థలలో విజయం సాదించిన మహిళలతో "ముఖా ముఖి", సంఘంలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సాంఘిక సంస్థలలో మహిళల పాత్ర, సోషల్ మీడియాలో ప్రయోజనాలు, అమెరికాలో గృహహింస, మహిళా ప్రముఖులను కలవటానికి , అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి - పంచుకోవటానికి, తెలుగు వాళ్ళతో స్నేహం చేయడానికి, ఈ కార్యక్రమం ఒక వేదిక కాబోతోంది.
ఈ మహా సదావకాశం వినియోగించుకోవాలని అమెరికాలో నివసిస్తున్న తెలుగు మహిళలకి, ATA విజ్ఞప్తి చేస్తోంది.

అమెరికాలోని వివిధ నగరాల్లో "ఆటా మహిళా దినోత్సవం" వివరాలు:

* వాషింగ్టన్ డి సి - మార్చ్ 9
* న్యూ జెర్సీ, న్యూ యార్క్ - మార్చ్ 10
*ఫిలడెల్ఫియా - మార్చ్ 8
*డల్లాస్ - మార్చ్ 23
* చికాగో - మార్చ్ 24

English summary
American Telugu Association (ATA) designated the whole month of March as ‘ATA Women’s Day Month’ on the occasion of International women’s day of 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X