NRI News: యూఎస్‍లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 96,917 మంది భారతీయుల అరెస్టు..

చట్టవిరుద్ధంగా యూఎస్(US) సరిహద్దును దాటుతూ పట్టుబడిన భారతీయులు(NRI) గత సంవత్సరంలో ఐదు రెట్లు పెరిగారు. అక్టోబర్ 2022, సెప్టెంబరు 2023 మధ్య కాలంలో అక్రమంగా యూఎస్‌లోకి ప్రవేశించిన 96,917 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యుసిబిపి) డేటాను ఉటంకిస్తూ పిటిఐ వార్తా సంస్థ నివేదించింది. అక్టోబర్ 2022, సెప్టెంబర్ 2023 మధ్య కెనడా సరిహద్దులో 30,010 మంది, మెక్సికో సరిహద్దులో 41,770 మంది పట్టుబడ్డారు.

ఇప్పటివరకు మెక్సికో, గ్వాటెమాల, హోండురాస్, ఈక్వెడార్ నుంచి వచ్చిన ప్రజలు USలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. అయితే భారతదేశం వంటి ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశిస్తున్నప్పుడు అరెస్టయిన వ్యక్తుల్లో అత్యధిక మంది పెద్దవారే ఉంటున్నారు. ఈసారి US సరిహద్దులో 84,000 మంది పట్టుబడ్డారు. 730 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

 96,917 Indians have been arrested illegally entering the US for a year

మొత్తంమీద, US ప్రపంచవ్యాప్తంగా అక్రమ వలసలను చూస్తోంది.అక్రమంగా సరిహద్దు దాటినందుకు ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ల మందిని అరెస్టు చేశారు. US ఫెడరల్ ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు కొనసాగుతుంది.
"ఈ సంవత్సరం ఇప్పటివరకు మేము భారత్ కు చెందిన 45,000 మందిని పట్టుకున్నాం. వారు మా దక్షిణ సరిహద్దును దాటి, కార్టెల్‌ల ద్వారా మా దేశంలోకి ప్రవేశించారు " అని అధికారి లాంక్‌ఫోర్డ్ చెప్పారు.

మెక్సికోలోని క్రిమినల్ కార్టెల్‌లు ప్రపంచం నలుమూలల నుంచి వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తాయి. దేశంలోకి ఎలా ప్రవేశించాలి, ఎక్కడికి వెళ్లాలి అనే దానిపై కార్టెల్ లు శిక్షణ ఇస్తున్నారని లాంక్‌ఫోర్డ్ తెలిపారు. డైరెక్ట్ అమెరికాకు రాలేని వారు కెనడా గుండా అమెరికాలోకి ప్రవేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ భారతీయ కుటుంబం కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మంచులో చిక్కుకుపోయి కుటుంబ సభ్యులు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+