NRI News: అమెరికాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ వాసి మృతి..

అమెరికాలోని హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందారు. ఇందుకు సంబంధించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పినెల్లాస్‌ పార్క్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ ముస్తఫా షరీఫ్‌ ఆహారం అందించి తిరిగి వస్తుండగా స్విమ్మింగ్‌ పూల్‌లోకి జారిపడి మృతి చెందినట్లు తెలిసింది. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఐదు నెలల చిన్న పిల్లవాడు ఉన్నారు.

హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌కు చెందిన షరీఫ్ తొమ్మిది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని, అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ను సహాయం అందించాల్సిందిగా అతని కుటుంబం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను అభ్యర్థించింది. మృతుడి తల్లిదండ్రులు, అత్తమామలకు అంత్యక్రియలకు హాజరు కావడానికి అత్యవసర వీసాలు మంజూరు చేయాలని న్యూ ఢిల్లీలోని యుఎస్ ఎంబసీని, అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్‌ను కోరాలని వారు మంత్రిని అభ్యర్థించారు. మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ షరీఫ్ కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని ఓదార్చారు.

A man from Hyderabad died after falling into a swimming pool in America

రెండు రోజుల క్రితం హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్యకు గురయిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు రయీస్ ఉద్దీన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఉద్దీన్ వద్ద ఉన్న నగదు, నగలును తీసుకెళ్లారు. మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ 2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు.

రయీస్ ను ఉగాండాకు చెందిన వ్యక్తి తో అఫ్గాని వ్యక్తి పొడిచి చంపినట్లు పోలీసులు భావిస్తన్నారు. డబ్బుల కోసం గొడవ పడి కత్తితో పొడిచి పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రయీస్ ఉద్దీన్ ను అసలు ఎందుకు హత్య చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. రయీస్ హత్య కుటుంబ సభ్యులకు తెలియండతో కన్నీరుమున్నీరువుతున్నారు. రయీస్ ఉద్దీన్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ను కోరారు. సమాచారం అందుకున్న స్థానిక నేత అంజదుల్లా ఖాన్‌ రైసుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కొద్ద రోజుల క్రితం లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతి జూన్ 13న వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లోని తన నివాసంలో హత్యకు గురైంది. మృతురాలు కొంతం హైదరాబాద్ లోని చంపాపేటుకు చెందిన తేజస్విని రెడ్డిగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+