NRI News: ఇరాక్ జగిత్యాల వాసి మృతి.. కువైట్ చిక్కుకున్న మరో వ్యక్తి..
స్థానికంగా ఉపాధి లేక చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ పడరాని కష్టాలు పడుతున్నారు. చివరికి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా జగిత్యాల రూరల్ మండలంలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన వంగ సురేశ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇరాక్ వెళ్లాడు. అతనికి జూన్ 23న పెరలాసిస్ రావడంతో అస్పత్రిలో చేరగా చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతను గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం గ్రామానికి మృతదేహం చేరగా, కుటుంబ సభ్యుల రోదనల మధ్య అంతక్రియలు నిర్వహించారు. నరేశ్ కు భార్య వసంత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో ఓ భారతీయుడు ఎడారిలో చిక్కుకుపోయాడు. సదరు వ్యక్తి తాను ఎడారిలో కష్టాలు పడుతున్నట్లు వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏజెంట్ కువైట్ ఉద్యోగమని చెప్పి.. ఏడారిలో తీసుకొచ్చి వదిలేశారని వాపోయాడు.

ఏడారిలో తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటరిగా ఉంటున్నట్లు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వీడియోలో వివరించాడు. పశువులు, కుక్కలు, బాతులకు ఆహరం పెట్టడానికి.. వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉన్న చోట మోటార్లు, జనరేటర్లు పని చేయడం లేదని చెప్పినా ఓనర్లు పట్టించుకోవడం లేదని రోదిస్తున్నాడు.
రెండు కిలోమీటర్లు నడిచి చెట్లకు నీళ్లు పోయాలని. భోజనం, నీళ్లు సరిగ్గా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏజెంట్ కు ఫోన్ చేస్తే పైసాలు కట్టాలని చెబుతున్నాడని.. తన వద్ద అంత డబ్బు లేదన్నాడు. ప్రభుత్వం స్పందించి తనను రక్షించాలని కోరాడు. బాధితుడి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతన్ని కాపాడాలని కోరుతున్నారు.
#viralvideo
— Telangana Awaaz (@telanganaawaaz) July 13, 2024
కువైట్.. ఎడారిలో..భారతీయుడి ఆవేధన
కువైట్.. ప్రవాసుడు ఆవేదన నన్ను ఇక్కడ నుంచి ఇండియాకు పంపించండి అని ప్రవాసుడు వేడుకుంటున్నాడు.#Telugu #AndhraPradesh #Telangana #INDIAN #Kuwait @IIKNews @indembkwt @narendramodi @KTRBRS @revanth_anumula @ncbn pic.twitter.com/Unbo1Zpzhf
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications