దుబాయ్‌లో తెలంగాణవాసి మృతి
ఆదిలాబాద్: దుబాయ్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని నిర్మల్ మండలం భాగ్యనగర్‌కు చెందిన లోస్రా సాయన్న (45) ఉపాధి నిమిత్తం ఐదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు.
మరో నెలరోజుల్లో తిరిగి వస్తానని ఇటీవలే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. కాగా, వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడి అధికారులు అతని గురువారం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

వార్త తెలియగానే భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు కన్నీటి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని వెంటనే గ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వానికి, అధికారులకు మృతుడి భార్య లక్ష్మి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications