అక్కినేని తృతీయ వార్షికోత్సవం చెన్నైలో

అమెరికాలో నటసామ్రాట్ అక్కినేని పేరిట ఏర్పాటైన అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ 2016 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ మేరకు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

అధ్యక్షుడు - రవి కొండబోలు
ఉపాధ్యక్షురాలు - శారద అకునూరి
కార్యదర్శి - ధామా భక్తవస్తలు
కోశాధికారి - రావు కల్వల
బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, డాక్టర్ సిఆర్ రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట
వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర

akkineni foundation of america press release

ఈ సందర్భంగా అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ వ్వవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో అక్కినేని ప్రధమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014లో గుడివాడలోను, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015లో హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నామన్నారు.

అందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడు అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో చెన్నైలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియ జేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+