NRI News: ఆ భారతీయులకు షాకిచ్చిన అమెరికా..!
అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని చాలా మంది అనుకుంటారు. కొంత మంది అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వస్తే మరి కొందరు అక్కడే స్థిరపడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీరందరికి అమెరికా షాక్ ఇచ్చింది. అక్రమ వలసదారులను నియంత్రించాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్‌ఎస్) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు వారి వారి దేశాలకు తిరిగి పంపుతున్నారు.
తాజాగా యూఎస్ అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు ఇండియన్లను అమెరికా వెనక్కు పంపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీరిని ఇండియాకు తరలించింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ సహాయంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. చాలా మంది విదేశీయులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వెళ్లడానికి ఛాన్స్ లేని పక్షంలో యూఎస్ సరిహద్దు దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా కెనడా వెళ్తారు. అక్కడి నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తారు.

గతంలో అమెరికా, కెనడా సరిహద్దులో కెనడా నుంచి యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నించిన భారతీయ కుటుంబం మంచులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. అయితే కెనడా చాలా మంది అమెరికాలోకి అక్రమంగా చేరుకుని ఉంటున్నారు. వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపాలని అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఉన్న పలువురు భారతీయ పౌరులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ సీనియర్ అధికారి చెప్పారు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
అక్రమ వాలసదారులను నియంత్రించేందుకు అమెరికా గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గినట్లు పేర్కొంటున్నారు. అమెరికా ఈ సంవత్సరంలోనే దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు తరలించింది. ఇందులో చైనా, భారత్, కొలంబియా, ఉజ్బెకిస్థాన్, మారిటానియా, ఊక్వెడార్, పెరూ, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.












Click it and Unblock the Notifications