NRI News: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు మృతి..
ఇండియా నుంచి చాలా మంది ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు విధి ఆడే వింత నాటకంలో చనిపోతుంటారు. తాజాగా
ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య అర్థిస్తుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సోమవారం రాత్రి 7.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఎన్నారై ఖుష్‌దీప్ సింగ్ ఏదో పని కారులో వెళ్తున్నారు.
అతడు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో అతని కారు పల్టీలు కొట్టుకుంటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖుష్ దీప్ సింగ్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అక్కడి చేరుకున్న మెల్ బోర్న్ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. పంజాబ్ కు చెందిన ఖుష్ దీప్ సింగ్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు ఉపాధి కోసం వెళ్లారు.

అతను అక్కడ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సంవత్సరం క్రితం అతని భార్య జప్ నీత్ కౌర్ మెల్ బోర్న్ వెళ్లింది. పై చదువుల కోసం ఆమె మెల్ బోర్న్ వెళ్లింది. అయితే తాజాగా భర్త ఖుష్ దీప్ చనిపోవడంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు. తమకు ఇండియాలో ఆస్తులు ఏం లేవని.. తన భర్త మృతదేహాన్ని భారత్ కు తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని ఆమె దాతలను అర్థించారు. దీనికోసం 'గోఫండ్‌మీ' పేజీ క్రియేట్ చేశారు. దాని ద్వారా విరాలాలు సేకరిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలో గతంలో కూడా జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకురావడానికి మృతుల కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే విదేశాల్లో చినిపోయిన వారిని వెంటనే ఇండియాకు తీసుకొచ్చేందుకు ఓ యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications