Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NRI News: 8 ఏళ్ల తర్వాత కువైట్ జైలు నుంచి విడుదల..

ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ జైలు శిక్ష అనుభవిస్తున్న భారతయ వ్యక్తి 8 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నాడు. కువైట్ అమీర్ దయతో అతను జైలు నుంచి బయటకు రాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన రాజరాజన్ ఉపాధి కోసం 2016 అక్టోబర్ 26న కువైట్ చేరుకున్నారు. రాజరాజన్‌ను విమానాశ్రయంలో అధికారులు పట్టుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కూడా అతనిపై అభియోగాలు మోపారు. అతని బ్యాగులో డ్రగ్స్ ఉండడంతో ఈ కేసు నమోదు చేశారు.

న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష (జీవితాంతం) విధించింది. రాజరాజన్ గత 8 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశ అమీర్ దయతో ఊరట లభించడంతో బహిష్కరణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి రాజరాజన్ ను ఇండియాకు పంపనున్నారు. 2016లో రాజరాజన్ కు తన స్నేహితుడు అబ్దుల్లా ద్వారా ఏజెంట్ ఖదీమ్ పరిచయమయ్యాడు. కువైట్ లో ఉద్యోగం ఉందని చెప్పాడు. దీంతో రాజరాజన్ కువైట్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. ఖదీమ్ వీసా ఏర్పాట్లు చేశాడు.

An Indian who is serving sentence in Kuwait jail is going to be released soon

2016 అక్టోబర్ 22 రాజరాజన్ కువైట్ వెళ్లేందుకు చెన్నై చేరుకున్నాడు. హోటల్ గదిలో కుమరేశన్ అనే వ్యక్తితో బస కల్పించారు. అక్టోబరు 25న కువైట్‌ పర్యటనకు ముందురోజు రాజరాజన్‌ వస్తువులను ఉంచే బ్యాగులో కుమరేశన్ డ్రగ్స్ పెట్టాడు. ఇది తెలియని రాజరాజన్ ఎయిర్ పోర్టు కు చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం రాజరాజన్ చెన్నై నుంచి కువైట్ వెళ్లాడు. మరుసటి రోజు అధికారులు కువైట్ విమానాశ్రయంలో తనిఖీల్లో రాజరాజన్ పెట్టెలో మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

రాజరాజన్ కువైట్ వెళ్లిన తర్వాత అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం రాలేదు. రెండు వారాల తర్వాత డ్రగ్స్ కేసులో రాజరాజన్ అరెస్ట్ అయినట్లు తెలిసింది. అతన తన సోదరి అన్పరశికి ఫోన్ చేసి జరిగిన కథను చెప్పాడు. దీంతో ఆమె కుమరేశన్ ఇంటికి వెళ్లింది.. కానీ అతని ఇంటికి తాళం వేసి ఉంది. వారు అతని మామ పళని ఇంట్లో సోదాలు చేసినప్పటికీ అతని గురించి తెలియలేదు. రాజరాజన్ సోదరి అన్పరాశి చెన్నైలోని డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్టును ఆశ్రయించారు.

వారి సహకారంతో తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే, తన సోదరుడి విడుదల కోసం కువైట్ హ్యూమన్ రైట్స్ సొసైటీని ఆశ్రయించారు.
తమిళనాడు ప్రభుత్వ అండర్ సెక్రటరీ సెంథిల్ కుమార్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. కువైట్‌లోని అప్పటి భారత రాయబారి జీవ సాగర్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రథమ కార్యదర్శి, కమ్యూనిటీ వెల్ఫేర్ అధికారి పిపి నారాయణన్‌ను ఆదేశించారు. ఫలితంగా 2017లో జైలు ఖైదీలకు అమీర్‌ ఇచ్చే వెసులుబాటు జాబితాలో రాజరాజన్‌ కూడా చేర్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+