వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా మెట్రో రైల్లో మన తెలుగమ్మాయి! ఓ పుస్తకంతో వెలుగులోకి...

ఓ తెలుగమ్మాయి అమెరికా మెట్రో రైలుకు దిక్సూచిగా మారింది. అక్కడ సబ్‌వే కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి భారతీయురాలిగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ పుస్తకం కూడా రాసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఓ తెలుగమ్మాయి అమెరికా మెట్రో రైలుకు దిక్సూచిగా మారింది. అక్కడ సబ్‌వే కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి భారతీయురాలిగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ పుస్తకం కూడా రాసింది.

మెట్రో కబుర్లు: అమీర్‌పేట్ టు మియాపూర్.. జస్ట్ 20 నిమిషాలే, ప్రయాణికులకు నిబంధనలివీ...మెట్రో కబుర్లు: అమీర్‌పేట్ టు మియాపూర్.. జస్ట్ 20 నిమిషాలే, ప్రయాణికులకు నిబంధనలివీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుజాత గిడ్ల బీటెక్ లో మెకానికల్ తీసుకుని ఆ తరువాత అమెరికాలో మాస్టర్స్ చేసింది. అదయ్యాక అక్కడే ఓ బ్యాంకులో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా చేరింది.

బ్యాంకు ఉద్యోగం, మంచి జీతం.. అయినా సుజాతకు జీవితం చాలా రొటీన్ గా తోచేది. రోజూ ఆమె తాను పనిచేసే బ్యాంకుకు సబ్ వే ట్రయిన్‌లో వెళ్లి వస్తుండేది. ఆ రైల్లో లేడీ కండక్టర్ ను చూస్తే ఆమెకు ముచ్చటేసేది. తనక్కూడా అలాంటి ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందో అనుకునేది.

 అనుకోకుండా ఒకరోజు...

అనుకోకుండా ఒకరోజు...

ఈలోగా ఆర్థిక సంక్షోభం రావడం, బ్యాంకులో ఉద్యోగం పోవడం జరిగిపోయాయి. ఒకరోజు పేపర్లో సబ్‌వే కండక్టర్ జాబ్ కోసం ప్రకటన వస్తే సుజాత దానికి దరఖాస్తు చేసింది. పరీక్ష కూడా రాసింది. అయితే ఫలితాలు రాకమునుపే ఇల్లు మారిపోవడంతో ఆమె ఆ ఉద్యోగానికి ఎంపికైందన్న విషయం ఆమెకు తెలియలేదు. కొన్నాళ్లు ఖాళీగా గడిపేసిన ఆమె సబ్‌వే కండక్టర్ ఉద్యోగం సంగతి ఏమైందో తెలుసుకుందామని రైల్వే కార్యాలయానికి వెళ్లి షాక్ తింది. నిజానికి ఆ ఉద్యోగానికి సుజాత ఎంపికైంది. రైల్వే వాళ్లు ఆమె పాత ఇంటి అడ్రెస్ కు ఎన్నోసార్లు సమాచారం పంపించారు కూడా.

అప్పుడు వెళ్లకపోయి ఉంటే...

అప్పుడు వెళ్లకపోయి ఉంటే...

నిజానికి సుజాత తన ఉద్యోగం సంగతి ఏమైందో కనుక్కుందామని రైల్వే కార్యాలయానికి గనుక వెళ్లకపోయి ఉంటే ఆమె ఉద్యోగం వేరే వాళ్లకు వెళ్లిపోయేదే. అధికారులు కూడా అదే చెప్పారు. ఆమె కోసం చూసి చూసి విసిగిపోయామని, వేరే వాళ్లకు ఉద్యోగం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని. అలా 2009లో తాను కోరుకున్న ఉద్యోగంలో చేరింది సుజాత గిడ్ల. మన దేశంలో రైల్వే గార్డ్ లాంటిదే ఆమె జాబ్. అక్కడి మెట్రో రైలు మధ్యలో కండక్టర్లు ఉంటారు. ప్యాసింజర్స్ కి తలుపులు తెరవడం, మూయడం, స్టేషన్లు వచ్చేటప్పుడు అనౌన్స్‌మెంట్ ఇవ్వడం, ప్రయాణికులు జాగ్రత్తగా ఎక్కేలా, దిగేలా చూడడం ఇవీ ప్రధానంగా అమెరికా మెట్రో రైలు కండక్టర్ బాధ్యతలు.

 అమ్మ బాధపడుతుందని...

అమ్మ బాధపడుతుందని...

కొత్తలో తన ఉద్యోగం గురించి సుజాత తన తల్లికి కూడా చెప్పలేదు. ఇలాంటి ఉద్యోగమా అని అమ్మ బాధపడుతుందేమో అనే భావనతో యూనిఫాం బ్యాగులో పెట్టుకుని, అక్కడికి వెళ్లాక ధరించేది. అయితే కొన్నాళ్లకు కూతురి ఉద్యోగం గురించి తల్లికి తెలిసిపోయింది. ‘చిన్న ఉద్యోగం అని కాదు.. నీ భద్రత గురించే నా ఆలోచనంతా..'అని తల్లి అనడంతో.. హమ్మయ్య అంటూ సుజాత ఊపిరిపీల్చుకుంది. భయపడాల్సిందేమీ లేదంటూ తల్లికి ధైర్యం చెప్పింది.

 ఒత్తిడితో కూడుకున్న వృత్తి...

ఒత్తిడితో కూడుకున్న వృత్తి...

బ్యాంకులో ఉద్యోగం చాలా రొటీన్ గా బోర్ కొట్టేదని, కానీ సబ్ వే కండక్టర్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని సుజాత చెబుతోంది. ‘ప్రతిరోజూ మేము కచ్చితంగా సమయానికి విధులకు హాజరుకావాలి. యూనిఫాంలో ఉండాలి. నిమిషం ఆలస్యమైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. నిబంధనలన్నీ తప్పకుండా పాటించాలి. ప్రయాణికులు మమ్మల్ని దూషించినా, కామెంట్ చేసినా వారిని ఏమీ అనకూడదు. ఒక్కోసారి ప్లాట్‌ఫామ్ కి కాస్త దూరంలో రైలు ఆగుతుంటుంది.. అలాంటప్పుడు ప్రయాణికులు సులువుగా దిగడానికి అవసరమైన స్టూల్ తీసుకెళ్లి వారిని జాగ్రత్తగా దింపాల్సి ఉంటుంది..' అంటూ తన ఉద్యోగబాధ్యతలు వివరిస్తుందామె.

ఆదో ఆనందం...

ఆదో ఆనందం...

సబ్ వే రైలులో ఉద్యోగంలో చేరిన తొలిరోజుల్లో ప్రయాణికులు తనను కొత్తగా చూసేవారని, అక్కడ తొలి భారతీయ కండక్టర్ ని అని తెలుసుకుని అభినందించేవారని సుజాత పేర్కొంది. సబ్ వే రైలులో ఎన్నో దేశాల వారు ప్రయాణిస్తుంటారని,ఒక్కోసారి భారతీయులు కూడా కనిపిస్తుంటారని, అప్పుడు వాళ్లని చూస్తే తనకెంతో ఆనందం కలుగుతుందని సుజాత తెలిపింది. తెలుగువారైతే ‘నమస్తే' అని.. తమిళంలో మాట్లాడుతుంటే ‘వణక్కం' అని, పంజాబీవాళ్లయితే ‘సస్రియాకాల్' అంటూ తాను అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంటానని, వారు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తుంటారని చెబుతోంది. ‘కండక్టర్‌గా అన్ని దేశాల వారితో కలిసి పనిచేస్తున్నాను. అందరితో మాట్లాడుతూ... వారి సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. మన సంస్కృతి గొప్పదనం వారికి చెప్పవచ్చు.. అదో ఆనందం..' అంటోంది సుజాత గిడ్ల.

 మన వాళ్లే చిన్నబుచ్చేవాళ్లు...

మన వాళ్లే చిన్నబుచ్చేవాళ్లు...

కొంతమంది భారతీయులు ఆమెను చూసి.. ‘ఇంత చదువు చదువుకొని ఈ కండక్టర్ ఉద్యోగం ఏంటి? వేరేది చూసుకోవచ్చు కదా?' అని సలహా ఇచ్చేవాళ్లట. మరికొందరేమో.. ‘మరో ఉద్యోగం రాక ఇలాంటి ఉద్యోగం చేస్తున్నట్లుంది..' అంటూ చిన్నబుచ్చేవాళ్లట.

నిజానికి ఫలానా పని తక్కువ.. ఫలానా పని ఎక్కువ అనే ఆలోచనే తప్పంటుంది సుజాత. ఆ మాటకొస్తే అమెరికావాళ్లే నయం. వారికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసు. ఎంత ఉన్నత చదువులు చదివినా వారికిష్టమైన పనులు చేస్తుంటారు. బస్ డ్రైవర్ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం, భవనాల కిటికీలు క్లీన్ చేసే ఉద్యోగాలు చేయడానికి కూడా వెనుకాడరు. మంచి ఉద్యోగం దొరికే వరకు ఖాళీగా కూర్చోకుండా చిన్నాచితక పనులు కూడా చేస్తారు. కానీ కొంతమంది భారతీయులు మాత్రం కోరుకునే ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా కూర్చుంటారు అంటారు సుజాత.

 కులం, అంటరానితనం ఇక్కడ లేవు...

కులం, అంటరానితనం ఇక్కడ లేవు...

మన దేశంలో మాదిరిగా అమెరికాలో కుల వ్యవస్థ, అంటరానితనం లేవని చెబుతోంది సుజాత. భారత్ మాదిరిగా తననెవరూ అమెరికాలో వేరుగా చూడరని చెబుతోంది. ఆమె తండ్రి ఇంగ్లీష్ లెక్చరర్ కావడంతో ఆయన ట్యూషన్స్ చెప్పేటప్పుడు విని ఆంగ్లం నేర్చుకుందట. తన ఇంగ్లీష్ ధాటి చూసి భారతీయులు తనది ఏదో అగ్రకులానికి చెందినదై ఉంటుందని భావించేవారట, తీరా ఆమె దళితురాలినని తెలియగానే దూరంగా వెళ్లిపోయే వారట. ‘అలాంటి పట్టింపులన్నీ భారత్‌లోనే, అమెరికాలో ఉండవని తాను భావించానని, కానీ మన భారతీయులు సంస్కృతి పేరుతో అమెరికాకు కూడా కులాలను తీసుకొచ్చేశారు.. అది మన భారతీయుల దౌర్భాగ్యం..' అంటూ నవ్వేస్తుందామె.

ఆ వయసులో అర్థమయ్యేది కాదు...

ఆ వయసులో అర్థమయ్యేది కాదు...

చిన్నతనం నుంచీ ఈ కుల వివక్ష తనను వెంటాడుతూనే ఉందంటారు సుజాత గిడ్ల. ‘విద్యార్థి దశలో నేను కమ్యూనిస్టు పార్టీలో చేరి తిరిగేదాన్ని. జైలుకు కూడా వెళ్లాను. మేం ముగ్గురం పిల్లలం. అమ్మ మంజుల ఒకచోట.. నాన్న ప్రభాకర్ మరో ఊళ్లో అధ్యాపకులుగా పనిచేసేవారు. మేం అమ్మతో ఉండేవాళ్లం. పేదరికంలో పెరిగిన మమ్మల్ని అంటరానివారిగా చూసేవారు. ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నారనేది ఆ వయసులో నాకు అంతుబట్టేది కాదు. మా మామయ్య పీపుల్స్‌వార్ గ్రూప్ నాయకుడు కె.జి.సత్యమూర్తి. అయితే నేను ఆయన్ని కలిసేటప్పటికే ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు..' అని వివరించారు సుజాత.

 ‘యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకంతో...

‘యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకంతో...

సుజాత గిడ్ల ఇంగ్లీష్ లో రచించిన ‘యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్' పుస్తకం ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. న్యూయార్క్ టైమ్స్, బీబీసీ తదితర మీడియాల్లో దానిపై రివ్యూలు, ఇంటర్య్వూలు కూడా వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ పుస్తకం విడుదలైన తరువాతే సుజాత అమెరికాలోని మెట్రో సబ్ వే లో పనిచేస్తున్న తొలి భారతీయ మహిళా కండక్టర్ గా అందరికీ తెలిసింది. అయితే తాను ఆ పుస్తకంలో కుల వ్యవస్థ గురించి, దళిత క్రైస్తవుల గురించి రాయడాన్ని అమెరికాలోని కొంతమంది భారతీయులు తప్పు పడుతున్నారని, ప్రపంచంలో ఏ మూలకెళ్లినా సంప్రదాయం, సంస్కృతి పేరిట తమతోపాటు తమ కులాలను కూడా తీసుకెళ్లి భద్రంగా కాపాడుకుంటున్న వారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం అంటూ నవ్వేస్తారామె!

English summary
A life story by a subway bus conductor in New York city, who happens to be the Telangana bidda (daughter of Telangana soil), is making waves in the United States. The life story, titled ‘Ants Among Elephants’ is hailed by critics as an unflinching account of caste and family in India. She is Sujatha Gidla. She hails from Kazipet, a small town in Telangana state. In her own words “caste is an accursed state in India, especially for Dalits: Your life is your caste, your caste is your life." Sujatha Gidla, who was born a so-called untouchable and now works as a conductor on the New York City Subway, has laid bare the labyrinth of caste system still existing in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X