NRI News: జలంధర్‌లో ఎన్నారై హత్య..
జలంధర్‌లోని ధిల్లాన్ రిసార్ట్‌లో సామాజిక సమావేశంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో 31 ఏళ్ల నాన్‌రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ)ని కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన ఎన్నారైని దల్జీత్ సింగ్ గా గుర్తించారు. దల్జీత్ సింగ్ నవంబర్ 9న యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చాడు.
అతను డిసెంబర్ 13 న తిరిగి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. దల్జీత్ సింగ్ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు. . అతని కడుపు, తలలో ఒక్కొక్క బుల్లెట్ దిగింది. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. "ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మృతుడి సోదరుడు, సంఘటన సమయంలో ఉన్న ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారని" అని జలంధర్ జాయింట్ కమిషనర్ సందీప్ శర్మ తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో మృతులు, నిందితులు తరన్ తరణ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి ఒకరికొకరు తెలిసిన వారని పోలీసులు చెప్పారు. రెండు వర్గాలు రిసార్ట్‌లో పార్టీకి హాజరయ్యేందుకు వచ్చారని, వాష్‌రూమ్‌లో ముగ్గురు వ్యక్తులు మృతులపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు బోర్ రివాల్వర్‌తో మృతుడిపై కాల్పులు జరిపాడు.
నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు రిసార్ట్‌లోని క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరా ఫుటేజీని సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 11 ఏళ్ల తర్వాత తన సోదరుడు భారత్‌కు వచ్చారని మృతుడి సోదరుడు గురుప్రీత్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications