సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 80వ సదస్సు మార్చి 16వ తేది, 2014 స్థానిక రుచి ప్యాలస్ రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 80 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డల్లాస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.
స్థానిక చిన్నారి నువ్వుల అభిరాం మరియు కుమారి చాగంటి ప్రతిమ ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు.
సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలిపారు. ప్రముఖ రచయిత నార్ల వెంకటేశ్వర రావు పురస్కార గ్రహీత, విశిష్ట మహిళా పురస్కార గ్రహీత, ప్రసిద్ద రచయిత్రి, సాహిత్య వేదిక ముఖ్య అతిథి అత్తలూరి విజయలక్ష్మిని సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య వేదిక పై ఆహ్వానించగా డా. యివటూరి భానుమతి పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

అత్తలూరి విజయలక్ష్మి తమ ప్రసంగంలో అనేక ప్రక్రియలలో వున్న సాహిత్యంలో భావ వ్యక్తీకరణ ఒక ముఖ్యమైన ప్రక్రియ అని, ఈ సాహిత్యం, ఒక దిక్సూచిలాగ మానవ జీవితానికి దిశా నిర్దేశాన్ని చూపి మహోన్నతమైన విలువలను అందిస్తూ మంచి మార్గం వైపు సంఘాన్ని నడిపించ గల శక్తి సాహ్యిత్య ప్రయోజనం అని ప్రసంగించారు. సాహిత్యం మానవ జీవితానికి వ్యక్తిత్వ వికాసాన్ని , విజ్ఞాన నిధిని, సుజ్ఞాన జ్యోతిని , మనో ధైర్యాన్ని , సంస్కారమనే తరగిపోని సంపదనీ ఇస్తుందని విజయలక్ష్మి వివరించారు.
ముఖ్య అతిథిని ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ 2014 వ సంవత్సరంలో జరిగిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో ముగ్గురు విశిష్ట మహిళలు సాహిత్య వేదికను అలంకరించటం ఒక విశేషమని, ఈ మాసములో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగడం, ఒక విశిష్ట మహిళ యిదే మాసంలో వేదికను అలంకరించడం యాదృచ్చికమైనప్పటికీ గర్వించదగ ఒక సంఘటన అని సభకు తెలియజేసారు.
టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు బండారు సతీష్ "మాసానికో మహనీయుడు" శీర్షిక లో భాగంగా భావ కవిత పితా మహుడిగా, నవ్య కవిత పితామహుడి గా పేరు పొందిన రాయప్రోలు సుబ్బారావు గురించి,"ఏ దేశ మేగిన ఎందు కాలిడిగా" లాంటి జనాదరణ పొందిన కవితలు, వారి రచనలు తృణకంకణం, ఆంధ్రావళి, కష్టకమల మున్నగు వాటిని సభకి వివరించారు.
స్థానిక సాహితీ ప్రియులు డా. జువ్వాడి రమణ , మద్దుకూరి చంద్రహాస్ మహాకవి శ్రీ శ్రీ వ్రాసిన అభివాస్తవిక కవిత్వ ధోరణిని సభకి పరిచయం చేసారు. కే.సి చేకూరి - సమాజంలో శూన్యత, మానసిక అలజడి, లేక అశాంతి కలిగినప్పుడు ఆ సమాజం చూపే ఒక ప్రభావమే సాహిత్యంమని, మారుతున్న సమాజంతో పాటు, మారుతున్న విలువలను స్పృశించి, ప్రభావితం చేస్తూ, సమాజ ప్రయోజనాన్ని ఆకాంక్షించేదే సాహిత్యం అని తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్, పాలక మండలి సభ్యుడు డా.సి.ఆర్.రావు అత్తలూరి విజయలక్ష్మిని శాలువతో సంయుక్తంగా సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సింగిరెడ్డి శారద, పున్నం సతీష్, బండారు సతీష్, దామిరెడ్డి సుబ్బు శ్రీమతి. అత్తలూరి విజయలక్ష్మిని జ్ఞాపికతో సత్కరించారు.
టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి వీర్నపు చినసత్యం , తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, కార్యవర్గ సభ్యులు చామ్కుర బాల్కి , చిట్టిమల్ల రఘు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications