మరిచిపోతున్నారు: అమెరికాలో బాలయ్య ఆవేదన ఇదీ

Posted By:
Subscribe to Oneindia Telugu

నూజెర్సి: ఇంగ్లీషుపై మోజుతో తెలుగువారు మాతృభాషను విస్మరిస్తన్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. అమెరికాలో తెలుగు భాషా సంస్కృతిని ప్రవాసాంధ్రులు పెంపొందిస్తున్నారని ఆయన అన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి బృందం అమెరికాలో పర్యటిస్తుంది.

నూజెర్సిలో గురువారం ఎన్నారైలనుద్దేశించి బాలకృష్ణ ప్రసంగించారు. నాట్స్‌ అధ్యక్షుడు మన్నవ మోహన్‌ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలకృష్ణ ప్రసంగించారు. ఉపాధి, ఉన్నత విద్య కోసం అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు భాషా, సంస్కృతిని మరచిపోలేదన్నారు.

Balakrishna

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను అమెరికాలో కూడా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్థిలో భాగస్వాములు కావాలని చెప్పారు.

జన్మభూమిలో స్వగ్రామాలను అభివృద్థి చేసుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో ఐటి రంగాన్ని మెరుగు పరచాలని కోరారు. ఈ బృందంలో దర్శకుడు క్రిష్‌, హీరోయిన్‌ శ్రియ, నిర్మాత రాజీవ్‌ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. విమానాశ్రయం నుంచి బాలకృష్ణ బృందానికి ఎన్నారైలు స్వాగతం పలికారు.

కార్యక్రమంలో నూజెర్సి అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ చివుకుల ఉపేంద్ర, ఎపి క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ చాముండేశ్వరి నాద్‌, కొర్రపాటి సాయి, డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్‌ పోలవరపు తులసి, తదితరులు ప్రసంగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party MLA and nandamuri hero Balakrishna said that Telugu people are neglecting their language
Please Wait while comments are loading...