ఎన్నారై తెరాస సెల్ వార్షికోత్సవం
లండన్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం (ఎన్నారై తెరాస విభాగం) మూడువ వార్షికోత్సవ ప్రతినిథుల సదస్సును లండన్‌లో ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకి, తెలంగాణా సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళుర్పించారు. తెలంగాణ ఉద్యమ, సంక్షేమ, రాజకీయ, సేవా రంగాల్లో మూడు సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా కేకు కట్ చేసారు.
ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కార్యకర్తలకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు, ఈ చారిత్రాత్మక పోరాటంలో తమకు బాగాస్వాములయ్యే అవకాశం కలిగిపించిన టీ.ఆర్.యస్ అధినేత కెసిఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రాణాలకు తెగించి దీక్ష చేసి తెలంగాణ ప్రకటనకు కారణమై 4 సంవత్సరాలైన సదర్భంగా కెసిఆర్ పోరాటాన్ని సభకు వివరించారు. ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ కు సహకరించిన క్షేత్రస్తాయిలోని టి.అర్.యస్ నాయకులు, ఇతర సంఘాలకు, ప్రింట్, డిజిటల్, ఆన్లైన్ మీడియా సంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు, తెలంగాణ ఎన్నారై ఫోరంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యావత్ తెలంగాణ లోకం, ప్రవాస తెలంగాణ బిడ్డలు కేవలం పది జిల్లాల హైదరబాద్ రాజధానిగా ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణాను కోరుకుంటున్నారని, అలా కాకుంటే కెసిఆర్ నాయకత్వంలో ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకైనా తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. పోరాట సమయాల్లో తెలంగాణ వాదులపై దండ యాత్రలు చేసి ఇప్పుడు జైత్ర యాత్రలు చేస్తున్నన పార్టీలు నాయకులు ముందు వారి నాయకత్వంతో ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ వచ్చే లాగ చూడాలని కోరారు.
కోర్ కమిటి సబ్యుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ - హైదరాబాద్ యూటీ, రాయల తెలంగాణ లేదా బద్రాచలం మీద కిరికిరి పెడితే మొహోద్యమం ఖాయమని, సీమంధ్ర నాయకులు ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని విభజనకు సహకరించి ప్రజలుగా కలిసి ఉండేటట్టు చూడాలని అన్నారు.
సభ్యుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ - పదమూడు సంవత్సరాల కెసిఆర్ పోరాటం, ఆమరణ దీక్ష నేటి తెలంగాణ ప్రకటనకు పునాది అని, కచ్చితంగా ఆ ఘనత గౌరవం కెసిఆర్‌కే దక్కుతుందని, ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని అన్నారు. అలాగే పునర్నిర్మాణంలో కూడా కెసిఆర్ నాయకత్వంలోని టి.అర్.యస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.అర్.యస్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం, జాయింట్ సెక్రటరీ అశోక్ గౌడ్ దూసరి, కోర్ కమిటి సభ్యులు మల్లేష్ యాదవ్ పప్పుల, రంగు వెంకట్, ప్రసాద్ తోట, చక్ర కుమార్, చోటు, జితేందర్ రెడ్డి బీరం, విక్రం కుమార్, రత్నాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications