Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ముందుగా జయశకంర్ చిత్ర పటానికి పూలు వేసి, అమరవీరులని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి.. "దేశ్ కి నేత కెసిఆర్" అంటూ నినదించారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై బీఆర్‌ఎస్ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కి పార్టీలో పని చేసే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఎలాగైతే ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కెసిఆర్ వెంట ఉన్నామో అలాగే నేడు కూడా దేశ గతిని మార్చే పోరాటంలో సైతం కేసీఆర్ వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.

BRS establishment day celebrations in London

ఎఫ్దీసి చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ఒక నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకై బయలుదేరిన గులాబీ జెండా నేడు కెసిఆర్ నాయకత్వంలో దేశ నలుమూలల ఎగరాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని ఆకాంక్షిస్తున్నారని అనిల్ తెలిపారు.

మనం కలలు కన్న తెలంగాణ ను కెసిఆర్ అహర్నిశలు కష్టపడి బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దారని, మన అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా మన బాధ్యత నిర్వహించాలని కోరారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కెసిఆర్ చరిత్రలో నిలవడం కాయమని అనిల్ తెలిపారు.

కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఖండాతరాల్లో ఉంటూ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనకోసం ఎన్నారైలంతా క్రియాశీలకంగా పనిచేశారని , వారి కృషిని బాధ్యతను అభినందించారు. ఇక్కడ వాతావరణం సైతం లెక్క చెయ్యకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రస్థాయిలోని నాయకులకు, ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు.

BRS establishment day celebrations in London

పార్టీ కార్యక్రమాలతో పాటు ఎన్నారై ఆడబిడ్డలు మన బతుకమ్మను బోనాలను సైతం మరువకుండా మన సంస్కృతిని విస్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు. కార్యవర్గ సభ్యులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ పట్ల, కెసిఆర్ పట్ల మీకున్న అభిమానం చాలా గొప్పగా ఉందని తెలిపారు. ఉద్యమ సమయం నుంచి కెసిఆర్ వెంటే ఉన్నాని ఎన్ని కష్టాలు వచ్చినా కెసిఆర్ ఎత్తిన జెండా కింద పెట్టకుండా తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.

నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఏదైనా తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందని, కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉదాహరణకు మేము ఊరులో వెళ్ళినప్పుడు కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నప్పుడు ప్రజలు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషం వేస్తుందని, కెసిఆర్ మాకు పెద్ద దిక్కు లెక్క ఒక మేన మామ లెక్క నా పెళ్లి చేసిందని చెప్తుంటారని తెలిపారు.

ఇలా ప్రతి పథకం కెసిఆర్ ఎంతో బాధ్యతతో ప్రవేశపెట్టారని, ఇలాంటి ప్రభుత్వాన్ని పార్టీని మనమంతా కాపాడుకోవాలని కెసిఆర్ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు ఎన్నారై బీఆర్ఎస్ నాయకులకు కృతఙ్ఞతలు. చివరిగా ముఖ్య అతిధులుగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం గార్లని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ వేడుకల్లో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరి బోర్డు ఉపాధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ముఖ్యనాయకులు సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, సతీష్ రెడ్డి బండ, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మాదిరెడ్డి నవీన్ రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, మధు యాదవ్, ప్రవాస సంఘాల నాయకులు గణేష్ కుప్పం, రంజిత్, స్వాతి బుడగం, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శ్రావ్య, విద్య, స్నేహ, పావని, మాధవ్, దీపాక్షర, రవి కిరణ్, వంశీ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+